వైఎస్సార్‌సీపీలో చేరిన కారెం శివాజీ


అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కరెం శివాజీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన శుక్రవారం ఆయన పార్టీలో చేరారు. కారెం శివాజీకి సీఎం జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా గత సార్వత్రిక ఎన్నకల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి భవిష్యత్తు లేదని భావించిన శివాజీ గురువారమే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో సరైన గుర్తింపు లేకనే రాజీనామా చేశానని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయాలకు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. 'ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చైర్మన్‌గా సుమారు మూడున్నర ఏళ్ళు పనిచేశాను. పదవీ కాలం ఉన్నా సీఎం జగన్ ఆశయాలకు ఆకర్షితుడిని రాజీనామా చేశాను. బేషరతుగా వైస్సార్‌సీపీలో చేరుతున్నాను. ఎస్సీ ఎస్టీల కోసం సీఎం తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చాలా బాగున్నాయి. 6 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చి వారి కళ్ళలో కాంతి కనిపిస్తోంది. నవరత్నాలు ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమ ఆంద్రప్రదేశ్‌గా మారుస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి మేలు చేశారు. ఆంగ్ల మాధ్యమం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. మాకు ఇంగ్లీష్ మీడియం అవసరం.. లేదంటే మా పిల్లలు వెనుకబడతారు. అందుకే మేము ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నాం.  మేమంతా సీఎం జగన్‌కు అండగా ఉంటాం.' అని తెలిపారు.


Popular posts
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*
Image
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పాఠశాలల ప్రారంభ నిర్ణయంపై పునరాలోచించాలి* ఏ.బి.వి.పి నేత చల్లా.కౌశిక్.... వింజమూరు, ఆగష్టు 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచించడం సబబు కాదని, వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌశిక్ బుధవారం నాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి కరోనా బారిన పడి బాధపడుతున్నా వారికి బోధపడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు పధకాల ప్రారంభం, ప్రచార ఆర్భాటాల కోసం పిల్లల జీవితాలను పణంగా పెట్టాలని చూస్తే ఏ.బి.వి.పి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్యార్ధుల తల్లిదండ్రులతో గ్రామ, గ్రామీణ సర్వేను ఏ.బి.వి.పి నిర్వహించిందని కౌశిక్ పేర్కొన్నారు. 82 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, డిగ్రీ, పి.జీ, విశ్వ విద్యాలయాలలో చదివే విధ్యార్ధులు రోగనిరోధక శక్తి కలవారన్నారు. వారిని కాకుండా కేవలం ముందుగా పాఠశాలల బడులను తెరవడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఇలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పర్యవసానాలలో భాగంగా ప్రారంభించిన కొద్ది రోజులలోనే లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఆన్లైన్ ఫీజుల దందాను అరికట్టడంలో శ్రద్దాసక్తులు లేని రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల ప్రారంభానికి ఎందుకంత ఆరాటమన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ఇక ప్రత్యక్షంగా చేసుకోవడానికి ప్రభుత్వం మార్గాలు సుగమం చేయడమేనని కౌశిక్ దుయ్యబట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందా - ప్రభుత్వ పధకాల ప్రచార దందా రెండూ కలిసి వస్తాయా అని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రోగ నిరోధక శక్తి తక్కువ కలిగి ప్రస్తుత కరోనా పరిస్థితులను ఎదుర్కోలేని పసిపిల్లలపై ప్రభుత్వ అసంబద్ధ ప్రయోగాలు విరమించుకోవాలని హితువు పలికారు. లేని పక్షంలో ఏ.బి.వి.పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని కౌశిక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Image