పౌష్టికాహారాన్ని అందించుట ద్వారా రక్తహీణత నివారణకు చర్యలు చేపట్టిండి :సిఎస్

పౌష్టికాహారాన్ని అందించుట ద్వారా రక్తహీణత నివారణకు చర్యలు చేపట్టిండి :సిఎస్
అమరావతి : గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారిలో రక్తహీనతను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలుపై ఆశాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించేందుకు బాలసంజీవని, బాలామృతం వంటి పథకాలను సక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా విటమిన్ ఎ, ఐఎఫ్ఏ, కాల్షియం మాత్రలు గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా మింగేలా చూడాలని చెప్పారు. ఆసుపత్రి ప్రసవాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా మాతా, శిశు మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని ఆశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 77 గిరిజన ప్రాంత మండలాల్లో అమలు చేస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ చెప్పారు. అనంతరం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సమీక్షిస్తూ ఎన్ని అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలున్నాయి, ఎన్ని అద్దెభవనాల్లోను, అద్దెలేని భవనాల్లో ఎన్ని కేంద్రాలు నిర్వహించబడుతుందీ ఆరా తీశారు. గర్భీణీలు,బాలింతలకు సంబంధించి అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహనను కలిగించేందుకు ప్రత్యేకంగా కరపత్రాలు, బుక్ లెట్లు ముద్రించి పెద్దఎత్తున ప్రచారం చేయాలని  ఆదేశించారు. ఇంకా మహిళా శిశు సంక్షేమశాఖకు సంబంధించిన వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు గురించి ఈ సమావేశంలో సిఎస్ నీలం సాహ్ని విస్తృతంగా సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆశాఖలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు,పథకాల అమలుతీరును సిఎస్ కు వివరించారు. సమావేశంలో ఆశాఖ సంచాలకురాలు కృతికా శుక్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image