కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

అమరావతి
*కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌
సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రారంభించిన సీఎం శ్రీ జగన్‌*
అమరావతి: కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌*
సీఎస్‌ఆర్‌ నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రులనుంచి వచ్చే సహాయం కోసం వైబ్‌సైట్‌* 
ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌గా ''కనెక్ట్‌  టు ఆంధ్రా''*
*ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కోసం సీఎం పిలుపు
సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయొచ్చు: సీఎం*
*కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ ప్రారంభం తర్వాత ప్రవాస ఆంధ్రులను ఉద్దేశించి సందేశం ఇచ్చిన ముఖ్యమంత్రి
*సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సందేశం:
''రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. 
మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యంకాదు, మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం మీరు ఎంతోకొంత మంచిచేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి'' 
కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్, ప్రణాళికా సంఘం డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్‌ఆర్టీ ఛైర్మన్‌ మేడపాటి వెంకట్‌ పాల్గొన్నారు.