మిషన్ బిల్డ్ కాదు మరో క్విడ్ ప్రోకో: పంచుమర్తి అనురాధ

మిషన్ బిల్డ్ కాదు మరో క్విడ్ ప్రోకో: పంచుమర్తి అనురాధ
గుంటూరు : మిషన్ బిల్డ్ పేరుతో ఏపీని అమ్మకానికి పెట్టారని టీడీపీ అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మిషన్ బిల్డ్ కాదు మరో క్విడ్ ప్రోకోకు ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా వేల ఎకరాలు జగన్ కొట్టేసినట్టు సీబీఐ నిర్ధారించిందని, దానికి సంబంధించి ఇప్పటికీ జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందేనని అన్నారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో అదేదోరణి అవలంభించడానికి ప్రయత్నిస్తున్నారని అనురాధ విమర్శించారు. టీడీపీ దీనిని తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. సంపద సృష్టించడం చేతకాకపోతే చంద్రబాబు దగ్గర క్లాసులు తీసుకోవాలని అనురాధ సూచించారు. రాజధానికి సంబంధించి రూ. 2 లక్షల కోట్ల సంపదను చంద్రబాబు కట్టబెడితే దాన్ని ఇవాళ స్మశానంగా మార్చారని విమర్శించారు. సంపద సృష్టించడం చాలా కష్టం అనేది సీఎం జగన్‌ గ్రహించాలన్నారు. విజయవాడలో ప్రభుత్వ ఆస్తులు అమ్మితే సహించేది లేదని, ఆస్తులు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనురాధ డిమాండ్ చేశారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image