జగన్‌పై ద్వేషం లేదు: పవన్


విశాఖ : సీఎం జగన్‌పై తనకు ఎలాంటి ద్వేషం లేదని జనసేన అధినేత పవన్ తెలిపారు. ఇసుక కొరతపై లాంగ్ మార్చ్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ జగన్‌ గొప్ప నాయకుడైతే తన కంటే ఎవరూ ఎక్కువ సంతోషించరన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను పార్టీ పెట్టలేదని చెప్పారు. తాను టీడీపీతో విభేదించిన మాట వాస్తవమేనని పవన్ స్పష్టం చేశారు.తాను కష్టాల్లో ఉన్న ప్రజలకు దత్తపుత్రుడినని చెప్పారు. తమ పాలసీలు సరిగా లేనప్పుడు ఎలా పరిపాలిస్తారని ఆయన ప్రశ్నించారు. అజయ్‌కల్లామ్‌ లాంటి ఆలోచనపరులు ఉండి కూడా ఎందుకిలా చేస్తున్నారని నిలదీశారు. వైసీపీలో ఏకస్వామ్యం మాత్రమే ఉందిని, ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ఒకడి ఇష్టానుసారం నడిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయన్నారు. జగన్‌ ప్రభుత్వంలో డిబేట్లు లేవని, ఆలోచనలు పంచుకోవడం కూడా లేదని పవన్ వ్యాఖ్యానించారు.  జగన్ ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నారని, అందుకే ఇలా జరుగుతుందని పవన్ తెలిపారు. ఇప్పటి వరకు వర్షాలు పడలేదా?, వరదలు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. పవన్ ఇంకా మాట్లాడుతూ ''ఇప్పుడే ఇసుక కొరత ఎందుకు వచ్చింది?. దేశంలో ఎక్కడా లేనట్లుగా ఇక్కడే ఇసుక కొరత ఎందుకు ఉంది. కూలీలు ఎందుకు చనిపోతున్నారు?. జీవనాధారం పోయిందని ఆవేదన పడుతూ సెల్ఫీ వీడియోలు తీసి కూలీలు చనిపోతున్నారు. ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా?. ఇంతమంది జనం ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేబినెట్‌ మంత్రులకు జీతభత్యాలు తీసుకునే అర్హత లేదు. జనం కష్టాలు అర్థంకాని వారికి ప్రజాధనంతో విలాసాలు ఎందుకు?. అధికారంలోకి రాగానే రాజధాని కట్టం అని చెప్పారు. విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదు. నా జీవితంలో చాలా చూసి వచ్చా, ఎన్నో దెబ్బలు తిన్నా. సూట్‌కేస్‌ కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి రాజ్యసభకు వెళ్లారు. విజయసాయిరెడ్డి విమర్శలకు మేం సమాధానం చెప్పాలా?. విజయసాయిరెడ్డి సమాజసేవ చేసి జైలుకి వెళ్లారా?. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై వైసీపీకి రెండు వారాల గడువు ఇస్తున్నాం. ఒక్కో కార్మికుడికి రూ.50 వేలు ఇవ్వాలి. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. రెండు వారాల్లో స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా. చంద్రబాబు మీద కోపంతో ఇంత మంది ప్రజల్ని శిక్షిస్తారా?. కూల్చివేతలతో మొదలుపెట్టిన ప్రభుత్వం కూలిపోతుంది. ఇది కర్మ సిద్ధాంతం కాదు..చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రజల్ని మీరు ఎలా చూస్తారో.. వాళ్లు మిమ్మల్ని అలానే చూస్తారు. 151 సీట్లు వచ్చిన నాయకులు కూడా దీనికి అతీతులు కాదు. నేను ఆశయానికి కట్టుబడేవాడిని. ప్రత్యేక హోదా అనే ఆశయానికి కట్టుబడే నేను మోదీతో విభేదించా. నన్ను మోదీ చాలా ప్రేమగా పిలిచేవారు. ప్రతి శుక్రవారం కోర్టులకు వెళ్లే మీరు జనాలను పాలిస్తారా?. కులాలు, వర్గాలు అంటూ మాట్లాడుకోవడం ఏపీ దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్‌ కులాల మధ్య ఇరుక్కుపోయింది. ఆర్టీసీ కార్మికుల కోసం తెలంగాణలో పార్టీలు ఏకమయ్యాయి. ఏపీలో అలాంటి పరిస్థితి లేదు'' అని చెప్పారు.


Popular posts
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
దసరా సెలవుల్లో.. రైళ్లు.. ఫుల్‌
చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు
టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనా విడుదల చేసిన చంద్రబాబు
Image