మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కి పోతిన నివాళి

మహాత్మ జ్యోతిరావు పూలే గారి 129 వ వర్ధంతి కార్యక్రమాన్ని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ గణపతి రావు రోడ్డులో గల తన కార్యాలయంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ పూలే సమాజంలో అసమానతలు తగ్గించడానికి అలుపెరుగని పోరాటం చేశారని , సమాజంలో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపాలంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమని నమ్మి అందరికీ విద్య అందుబాటులోకి తెచ్చిన మహనీయుడని, కుల వ్యవస్థ నిర్మూలన కోసం, స్త్రీ పురుషుల సమానత్వం కోసం మొక్కవోని దీక్షతో పోరాటాలు చేసిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. బిసి డిక్లరేషన్ చేసి అధికారంలోకి వచ్చిన వైయస్సార్ సిపి పార్టీ ఇంతవరకు బీసీ ల్లోని 139 ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామన్న హామీని ఇంతవరకు అమలు చేయలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అమల్లో ఉన్న 34 శాతం రిజర్వేషన్లు తగ్గించే కుట్రలు చేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు బీసీల ద్రోహి కాకతప్పదని, మంత్రివర్గంలో కృష్ణా-గుంటూరు జిల్లాలలో గెలిచిన బీసీ ఎమ్మెల్యేల కాకుండా ఓడిపోయి ముఖ్యమంత్రి గారితో పాటు కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తికి మంత్రి వర్గంలో స్థానం కల్పించడం బి.సి లను మోసం చేయడం కాదా అని, బీసీలు చైర్మన్లుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లలో బీసీలను తీసివేసి రెడ్డి సామాజిక వర్గంతో నింపడం బిసిల మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. బీసీలకు మాటల్లో వాటాలు ఇస్తూ చేతల్లో మోసం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.