నేటి సమాజంలో మహిళలకు ఆత్మరక్షణ పై శిక్షణ అవసరం

నేటి సమాజంలో మహిళలకు ఆత్మరక్షణ పై శిక్షణ అవసరం
ఏబీవీపీ మిషన్ సాహసి కార్యక్రమం గోడ పత్రికను విడుదల


గూడూరు :


అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి స్థానిక డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాలలో మిషన్ సాహసి కార్యక్రమం గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది ఈనెల 19వ తేదీన ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలలో చదివే విద్యార్థినులకు ఆత్మరక్షణ పై శిక్షణ కార్యక్రమం మిషన్ సాహసి అనే పేరుతో దేశ వ్యాప్తంగా అన్ని కళాశాల కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతి లక్ష్మి గారు మాట్లాడుతూ విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం ఇలాంటి శిక్షణలో చాలా అవసరమని అన్నారు ఆత్మరక్షణ పై శిక్షణ ఉంటే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందన్నారు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ఏబీవీపీ విద్యార్థి సంఘానికి అభినందనలు తెలిపారు అనంతరం నెల్లూరు జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ఏబీవీపీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు మహిళల పై దాడులు ఎదుర్కోవడానికి ,ర్యాగింగ్ ,
ఈవ్ టీజింగ్ ,పోకిరి నుండి ఎటువంటి ఆయుధాలు లేకుండా ఎదుర్కోవడం పట్ల ఏబీవీపీ ఆధ్వర్యంలో  మిషన్ సాహసి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తున్నామని విద్యార్థులు యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆత్మరక్షణ పై శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కార్తీక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జార్జ్ నగర కార్యదర్శి నగర సహాయ కార్యదర్శి హర్షవర్ధన్ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు