జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం.

అమరావతి సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని‌ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం.
వివిధ సంక్షేమ పధకాలకు లబ్దిదారుల ఎంపికకై నవంబరు 20 నుండి డిశంబరు 20 వరకూ నెల రోజులు పాటు వైయస్సార్ నవశకం పేరిట    గ్రామ,వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటా సర్వే క్యాంపెయిన్ కార్యక్రమం సిఎస్.
వివిధ సంక్షేమ పధకాలకు అర్హులైన లబ్ధిదారులను సాట్యురేషన్ పద్ధతిలో గుర్తించి ఎంపిక చేసేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్..
ముఖ్యంగా నూతన బియ్యం కార్డు, వైయస్సార్ పెన్షన్ కానుక కార్డు, వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీకి లబ్దిదారుల గుర్తింపునకు చర్యలు.
అదేవిధంగా 7 ఇతర సంక్షేమ పథకాలైన వైయస్సార్ మత్స్య కార భరోసా, వైయస్సార్ నేతన్న నేస్తం, వైయస్సార్ సున్నా వడ్డీ పథకం, అమ్మ వడి, ట్రైలర్లు,రజకులు,నాయీ బ్రాహ్మ ణుల షాపులు, వైయస్సార్ కాపునేస్తం,ఇమామ్స్,మౌజంలు, పాస్టర్లు, అర్చకులకు సంబంధించిన లబ్దిదారుల గుర్తించేందుకు క్యాంపెయిన్లో చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశం.
ఈ వీడియో సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన పధకాలకు లబ్దిదారుల గుర్తింపునకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయా శాఖల కార్యదర్శులు వివరించారు.
ఈవీడియో సమావేశంలో  పాల్గొన్న సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు,ఇతర అధికారులు..