రాష్ట్ర సంపద ఏ ఒక్కరిదో కాదు : మంత్రి బొత్స

రాష్ట్ర సంపద ఏ ఒక్కరిదో కాదు : మంత్రి బొత్స
మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి
మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం : సముద్రాన్నే నమ్ముకొని చేపలవేట వృత్తిగా సాగిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించిందని పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, అన్ని వర్గాల వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. గురువారం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పడూ లేని విధంగా మత్స్యకారులకు రూ. 500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి 10 వేల రూపాయలు ఇస్తుందని, జిల్లాలో 2645 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. డీజిల్ సబ్సిడీని 6 రూపాయల 3 పైసలు నుంచి 9 రూపాయలకి పెంచామని.. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో రూ.5 లక్షల ఇచ్చేవారని.. దానిని తమ ప్రభుత్వం ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు.