పంచాయితీ ఎన్నికలకు  పచ్చజెండా

*పంచాయితీ ఎన్నికలకు  పచ్చజెండా* 
 *డిసెంబరు 15కు బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం* 
 *జనవరి 10న రిజర్వేషన్ల జాబితా ఖరారు* 
 *మరుసటి రోజు నుంచి ఎన్నికల కోడ్‌* 
 *రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ ఆదేశాలు* 
బ్యాలెట్‌ పేపర్‌ రంగు...
 *వార్డు మెంబర్‌ : తెలుపు* 
 *సర్పంచ్‌ : గులాబి* 
సాధారణంగా సంక్రాంతికి పల్లెల్లో సందడిగా వుంటుంది
. అయితే ఈసారి అంతకుముందుగానే గ్రామాల్లో మరింత సందడి ఏర్పడబోతోంది.
 సంక్రాంతికి ముందే స్థానిక ఎన్నికల నగారా మోగనుంద
. కొత్త సంవత్సర ప్రారంభం నుంచే హడావిడి నెలకొనబోతోంది.
 డిసెంబరు 15నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు.
 జనవరి 10న పంచాయతీల రిజర్వేషన్లు ఫైనల్‌చేస్తే మరుసటి రోజునుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుంది..