మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతోంటే జీర్ణించుకోలేని పరిస్థితి

డిసెంబరు 2, 2019
గుంటూరు


గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 'వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా' ప్రారంభం అనంతరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు:


– ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతోంటే జీర్ణించుకోలేని పరిస్థితి.
– ఈ మధ్య కాలంలో నా మతం, కులం గురించి మాట్లాడుతున్నారు.
– కానీ 'నా మతం మానవత్వం. నా కులం మాట నిలబెట్టుకోవడం' అని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను.
– ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినా, పొట్ట కూటి కోసం పనులకు వెళ్లే అవసరం లేకుండా ఈ పథకం ప్రవేశపెట్టాము. 
– రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు ఇస్తాము. అది ఎన్ని నెలలైనా ఇస్తాము. వైద్యులు ఎన్నాళ్లు సూచిస్తే అన్ని రోజులు ఈ సహాయం చేస్తాము. 
– అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి కూడా పెంచాము.
– ఆ మేరకు జనవరి 1 నుంచి కొత్త కార్డులు జారీ చేయబోతున్నాము. వాటికి క్యూఆర్‌ కోడ్‌ కూడా ఇస్తాము. అందులో ఆ వ్యక్తి మెడికల్‌ రికార్డుకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి.
–  ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, 1200 రోగాలకు పథకం విస్తరిస్తూ, జనవరి 1 నుంచి మార్పు చేయబోతున్నాం. 
– వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ లో చేరుస్తాము. పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 1 నుంచి 3 నెలల పాటు అమలు చేస్తాము.
– ఆ తర్వాత ఏప్రిల్‌ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరిస్తాము. 
– ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 వేల రోగాలను తీసుకువస్తాము.
– రూ.1000 దాటిన ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తాము
– 108, 104 సర్వీసులను మెరుగుపరుస్తూ 1060 అంబులెన్సులు కొనుగోలు చేస్తాము. ఏప్రిల్‌ 1 నాటికి అవి అందుబాటులోకి వస్తాయి.
– ఆరోగ్యశ్రీలో పెను మార్పులు చేస్తూ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 150కి పైగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాము.
– డిసెంబరు 15 నాటికి 510 రకాల మందులు ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులోకి వస్తాయి.
– ఇవే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్‌ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన ఔషధాలు అందుబాటులో ఉంటాయి
– డిసెంబరు 26 నుంచి ఆస్పత్రుల్లో పరిస్థితుల మార్పు. నాడు–నేడు. మూడేళ్లలో ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నాము.
– జనవరి 1 నుంచి పింఛన్లు. తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛను
– పక్షవాతం, ఇతర జబ్బులతో వీల్‌ చైర్, మంచానికే పరిమితమైన వారికి రూ.5 వేలు పింఛను ఇస్తాము
– ఇంకా బోదకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్‌ 3, 4, 5)  రూ.5 వేలు ఇస్తాము. అదే విధంగా కుష్టు వ్యాధిగ్రస్తులను రూ.3 వేల కేటగిరీలోకి తీసుకువస్తాము
– మే నెల నాటికి ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు, నర్సులు, సిబ్బంది పోస్టులన్నీ భర్తీ చేస్తాము.
– జనవరి 1 నుంచి క్యాన్సర్‌ రోగులకు మెరుగైన చికిత్స. వారిని ఆరోగ్యశ్రీలో చేర్చాము. కానీ రేడియేషన్‌కు చాలా ఖర్చవుతోంది.
– అందుకే జనవరి 1 నుంచి ప్రతి క్యాన్సర్‌ రోగికి ఎన్ని సైకిల్స్‌ అవసరమైనా, అన్నింటి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.
– నెట్‌వర్క్‌ ఆస్పత్రులను గ్రేడ్‌–ఏ, గ్రేడ్‌–ఏ ప్లస్‌గా మార్కింగ్‌ చేయమని నిర్దేశించాము.
– ఏ ఆస్పత్రి కూడా గ్రేడ్‌–ఏ కేటగిరీలో లేకపోతే ఆరోగ్యశ్రీ వర్తింపచేయలేము. 
– ఆరు నెలల్లో గ్రేడ్‌–ఏ ఆస్పత్రులు కచ్చితంగా గ్రేడ్‌–ఏ ప్లస్‌గా మారాలి
– విజయనగరం, పాడేరు, ఏలూరు, గురజాల, మచిలీపట్నం, మార్కాపురం, పులివెందులలో కొత్త ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాము
– వైద్యం అన్నది ఒక పర్వం. దీంతో పాటు ప్రజల అలవాట్లు మారాలి. సమాజం కూడా మారాలి. అప్పుడే వైద్యం ఖర్చు తగ్గుతుంది.
– అందుకే మద్యం షాపులు క్రమంగా తగ్గిస్తున్నాం. 20 శాతం మద్యం షాపులు తగ్గించాము. 43వేల బెల్టుషాపులు మూసివేయించాము. 
– ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియమ్‌గా మారుస్తున్నాము. 
– ఎవరు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతాను. మీ అందరి దీవెనలు, దేవుడి ఆశీస్సులతో గట్టిగా నిలబడతానని నమ్ముతున్నాను.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image