శ్రీసిటీలో ప్లాస్టిక్ పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

శ్రీసిటీ -అంతిమతీర్పు







సెజ్ డీసీ కార్యాలయం, శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 

"ప్లాస్టిక్" పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు 

 

శ్రీసిటీ, డిసెంబర్ 04,

 

శ్రీసిటీ పరిధిలోని ఇరుగుళం, మాదనపాలెం ప్రభుత్వ హైస్కూళ్లు, శ్రీసిటీ-చిన్మయ విద్యాలయ పాఠశాలలో ప్లాస్టిక్ నివారణ,ప్రత్యామ్నాయాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. శ్రీసిటీ సెజ్ డెవలప్మెంట్ కార్యాలయం మరియు శ్రీసిటీ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ నెల 3,4 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించాయి. ఒక్కో పాఠశాలలో మూడు బహుమతుల చొప్పున మొదటి బహుమతిగా 750 రూపాయలు, ద్వితీయ బహుమతి 500 రూపాయలు, త్వితీయ బహుమతిగా 250 రూపాయలు విజేతలకు బుధవారం సెజ్ డెవలప్మెంట్ కమీషనర్ ముత్తురాజ్ చేతుల మీదగా పంపిణీ చేశారు. దీనితో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  ముత్తురాజ్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగంతో పెరుగుతున్న పర్యావరణ సమస్యలను, ఎలా నివారించాలనే పలు అంశాలను విద్యార్థులకు వివరించారు. నేటి సమాజంలో ప్లాస్టిక్ నివారణ ప్రాముఖ్యత పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకే ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.

 

చెరివి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన విద్యార్థులు:


 

పచ్చదనం పెంపులో భాగంగా శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీసిటీ పరిధిలోని చెరివి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల చేతికే వివిధ రకాల మొక్కలు ఇచ్చి పాఠశాల ఆవరణలో నాటించారు. మొత్తం 75 మొక్కలు నాటగా, శ్రీసిటీ సెజ్ డెవలప్మెంట్ కమీషనర్ ముత్తురాజ్ ముఖ్య అతిధిగా పాల్గొని మొదటి మొక్కను నాటారు. విద్యార్థుల సహకారంతో మొక్కల సంరక్షణ బాధ్యత కూడా తీసుకోనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. కాగా శ్రీసిటీలోని అన్ని పాఠశాలల ఆవరణలో మొక్కల పెంపకంతో పాటు, పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని శ్రీసిటీ ఫౌండేషన్ శ్రీసిటీ పరిధిలోని అన్ని పాఠశాలల్లో చేపట్టగా, అందులో కొనసాగుంపుగా చెరివిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీసిటీ ఫౌండేషన్ మేనేజర్ సురేంద్రకుమార్ తెలిపారు.