సకాలంలో  వస్తున్న  ప్రత్యేక న్యాయస్థానాల తీర్పులు హర్షణీయం 


విజయవాడ తేదీ: 03.12.2019సకాలంలో  వస్తున్న  ప్రత్యేక న్యాయస్థానాల తీర్పులు హర్షణీయం 
 
తద్వారా బాలలపై జరుగుతున్నవేధింపుల కేసులలో సత్వర న్యాయం
 
 - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ,  చైర్ పర్సన్,  జి. హైమావతి


 
ఆంధ్రప్రదేశ్ లో పోక్సో కేసుల విషయంలో జిల్లా మరియు ప్రత్యేక న్యాయస్థానాలు, పోలీస్ యంత్రాంగం మరియు ఇతర సంబంధిత శాఖాల అధికారులు స్పందిస్తున్న తీరు, త్వరితగతిన తీసుకుంటున్న చర్యలు  హర్షణీయమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జి. హైమావతి వారిని ప్రసంశించారు. ఆంధ్రప్రదేశ్ లో  బాలలు మరియు బాలికల హక్కుల పరిరక్షణకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, తీసుకుంటున్న నిర్ణయాల వలన ఆడపిల్లలకు, మహిళలకు అదేవిధంగా ఆయా1 కుటుంబాలకు భరోసా మరియు ధైర్యంతో ఉంటున్నారని తెలియజేసారు.   
 
మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో నగరం నడిబొడ్డున "దిశ " అత్యాచారం మరియు హత్య అత్యంత హేయమైన చర్య అని, జరిగిన సంఘటన పై ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి కేసులలో చట్టాలను అమలు పరచడం, దోషులను శిక్షించడంలో  ఎలాంటి జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన పరిష్కరించడం చేయాలనీ  ఆ దిశగా  తెలుగు  రాష్ట్రాలలోని    ప్రభుత్వాలు  చర్యలు  చేపట్టడాన్ని   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరుపున  స్వాగతిస్తున్నామని అన్నారు.  ప్రతిరోజు ఎక్కడో  ఒకచోట  రిపోర్ట్   అవుతున్న బాలబాలికలు మరియు మహిళలపై అత్యాచారాలు, హత్యలు నివారణ అందరి  బాధ్యత  అన్నారు, రాబోయే భవిష్యత్ తరాలకు  ఒక ఆరోగ్యకర సమాజం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో  విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు.  దీనితో పాటుగా అభివృద్ధి పథంలో భాగంగా వస్తున్నా కొత్త పంథాలు, అవిష్కరణల్లో సమాజానికి ఉపయోగపడేది లేనిది చూసి వాటిని ప్రోత్సహించాలని అన్నారు.  
 
బాధితులకు న్యాయం జరుగుతుందనే    భరోసా కల్పించి, వారికీ  అండగా ఉండేలా  ధైర్యాన్ని సంబంధిత వ్యవస్థల ద్వారా కల్పించాల్సిన  భాద్యత  అన్ని  ప్రభుత్వ  శాఖలు  తీసుకోవాలని హైమావతి పేర్కొన్నారు.   అప్పుడే ఎక్కడైనా ఎటువంటి సంఘటనలు జరిగిన, జరగడానికి ఆస్కారం ఉన్న వెంటనే నమ్మకంతో  ప్రజలు   ఫిర్యాదు చేస్తారని అభిప్రాయపడ్డారు. బాలలపై  జరుగుతున్న  లైంగిక  వేధింపుల  నిరోధమునకు  పోక్సో కేసులకు సంబంధించి ప్రత్యేక  న్యాయస్థానాల  ద్వారా త్వరితగతిన   కేసుల  విచారణ  జరిపి    తీర్పులు రావడం  హర్షించదగ్గ  అంశమని, జిల్లా  న్యాయయస్థానాలను  ఈ సందర్బంగా  అభినందించారు.   క్రిష్ణ జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన బాలికపై మారుటి తండ్రి లైంగిక దాడికి పాల్పడిన కేసుకి  సంబంధించి  దోషులకు  20 సంవత్సరాల జైలు శిక్ష  వేయడం  ద్వారా  దోషులకు తప్పకుండ శిక్ష పడుతుందని, తప్పించుకోలేరని రుజువు చేస్తూ నమ్మకాన్ని పెంచారన్నారు., అంతేకాని గతంలో లా దోషులను నామమాత్రంగా అరెస్ట్ చేసి, బెయిల్ పేరుతో లేదా మరే కారణాల వలనైనా సమాజంలో వదిలేస్తే  మరో మారు పిల్లలు, మహిళలు పై అఘాయిత్యము చేయడానికి అవకాశం ఉండేదని,  కానీ  ప్రస్తుతం వస్తున్నా  త్వరితగతిన   తీర్పులవలన  బాధితులకు  నమ్మకం  కలుగుతుందని,  న్యాయస్థానాల  తీర్పులను  అందరు  అభినందించదగ్గ  అంశం  అని  అన్నారు.  
 
తల్లితండ్రులు వారి కుటుంబాలలో పిల్లల్ని పెంచే క్రమంలో ఆడపిల్లల్ని, మహిళల్ని   గౌరవించడం,  మర్యాద ఇవ్వడం, ఆప్యాయత అనురాగాలు, బాధ్యతలను తెలుసుకొని మెలిగేలా పెంచాలన్నారు.  అతి గారాబం, అవసరానికి మించి  డబ్బులు ఇవ్వడం, వస్తువులు కొనివ్వడం కూడా పిల్లల్లో నిర్లక్ష్యధోరణి, దురలవాట్లకు లోనవడానికి కారణాలు అవవుతాయన్నారు. అందుకని తల్లిదండ్రులు పిల్లల్ని  చాలా బాధ్యత తెలుసుకునేలా పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. 
ప్రపంచీకరణ  రాష్ట్ర  దేశ  ప్రయోజనాలు  దృష్టిలో  పెట్టుకొని  దీర్ఘకాలిక  దార్శనికత  అనుగుణంగా  మన ప్రభుత్వం బాలల హక్కులు పరిరక్షణకు కట్టుబడి ఉండడమే కాకుండా బాలలకు స్నేహపూర్వక ఆరోగ్యకర సమాజాన్ని అందించడానికి అమలు చేస్తున్న బాలల  అభివృద్ధి  కేంద్రీకృత పథకాలు, అనుసరిస్తున్న విధానాలు, ఆహ్లాదకర వాతావరణంలో విద్య, ఆత్మ రక్షణ సంబంధించి శిక్షణ కార్యక్రమాలను అందరు  స్వాగతించాలని  పిలుపునిచ్చారు. 


మహిళలకు ఎల్లవేళల   అందుబాటులో  ఉండి స్పందిచే విధంగా పనిచేస్తున్న  ఉచిత  సహాయ  ఫోన్  నంబర్లు 112,181,100,1090,1091 తో పాటుగా చైల్డ్ లైన్ 1098,   '0' FIR  ఫైలింగ్, వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్స్, మహిళమిత్ర, శక్తిటీమ్స్ మొదలైన ఎన్నో బాలల, మహిళల రక్షణకు, భద్రతకు అండగా కల్పిస్తున్నారన్నారు. వీటన్నింటిపై  ప్రతిఒక్కరు అవగాహనా పెంచుకుని, ఆపద సమయములో వినియోగించుకోవాలని కోరారు. కుటుంబం కేంద్రంగా బాలల సంక్షేమం, పాఠశాల, కళాశాల  విద్య అభివృద్ధి కై రూపొందించిన "అమ్మఒడి " పథకం అంతర్జాతీయంగా ఆదర్శమని కొనియాడారు. ప్రతి తల్లితండ్రులు ఈ పథకం క్రింద  వారి పి


ల్లలకు విద్య ద్వారా   బంగారు భవిష్యత్ ను అందించడానికి వీలవుతుందని కొనియాడారు.
 
అలాగే కమిషన్ ద్వారా అవహగానా ప్రచారానికి  వివిధ అంశాలపై IEC మెటీరియల్ తో   విద్యార్ధులుకు, తల్లిదండ్రులుకు, సమాజంలో  చైతన్యం మరియు బాలల హక్కుల పట్ల అవగాహనా, పరిరక్షహించుకునే విధానాలు, అందుబాటులో ఉన్న సేవల గూర్చి సంబంధిత శాఖల సమన్వయంతో, సాంకేతిక బృందాల సహకారాన్ని, థెమటిక్ వర్కింగ్ గ్రూప్స్, నెట్ వర్క్స్, స్వచ్చంద సంస్థలు మొదలైన సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహనా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరుగిందని  వీటిని  మరింత  విస్తరించి  కొనసాగిస్తామని  అన్నారు.
 
అలాగే కమిషన్ ద్వారా బాలల చట్టాలైనా కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్, పోక్సో , బాలల న్యాయ చట్టం, ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టంల ను  పర్యవేక్షించడం తో పాటుగా బాల్య వివాహ నిషేధ చట్టం, బాల మరియు కిశోర కార్మిక నిర్ములన చట్టం మొదలైన ఇతర బాలలకు సంబంధించిన చట్టాల అమలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని  తెలిపారు. ఎక్కడైనా బాలబాలికలకు సంబంధించి సమస్యలు తెలియ చేయాలన్న ఇమెయిల్ : cp.apscpcr2017@gmail.com  ద్వారా లేదా  చినకాకాని , మంగళగిరి లో ఉన్న కమిషన్ కార్యాలయం లో నైనా తెలియచేయవచ్చని అన్నారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image