తక్షణమే చెల్లించాలి: సంతోష్

*అధ్యాపకుల జీతాలు చెల్లించని  గణపతి ఇంజనీరింగ్ కళాశాల*   


 *తక్షణమే చెల్లించాలి: సంతోష్* 


వరంగల్ జిల్లా లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అనుబంధ సంస్థ అయినటువంటి గణపతి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగులకు జీతాలు దాదాపు 3 నుంచి 6 నెలలు ఇవ్వకపోవంతో వారు తీవ్ర మనస్తాపానికి గురై వారి ఉద్యోగలను కూడ వదులుకునే పరిస్థితి ఏర్పడింది.అధ్యాపకుల జీతాలు 1 సంవత్సరం  నుంచి ఇవ్వకపోవడంతో వారి ఆలనా పాలనాకు,వారి ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్స్ ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ వ్యవరిస్తు, యాజమాన్యంను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారని ఉద్యోగులు అంత వారి ఉద్యోగాల నుంచి తప్పుకోవడం,వారందరూ కలసికట్టుగా హైదరాబాద్ లోని ఉద్యోగుల సంఘం తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులను సెప్టెంబర్ నెలలో కలసి వారి సమస్యలను వివరించడం జరిగిందన్నారు. ఈ విషయం పైన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ తెలియజేస్తూ అధ్యాపకుల జీతాల జాప్యం విషయంపైనా వినతి పత్రం తీసుకోవడం జరిగింది. అదే రోజు కళాశాల ప్రిన్సిపాల్ , చైర్మన్ లతో మాట్లాడితే వారు చెల్లిస్తాం అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ చెల్లించక పోవడంతో, అదే విషయాన్ని వారికి ఒక ఉత్తరం కూడ వ్రాయడం జరిగింది.కాని వారియొక్క విధానం ఏవిధంగా ఉంది అంటే మేము చెల్లించం ఏమీ చేస్తారు అనే దోరణిలో కనపడుతుంది. తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా పిలవబడుతున్న వరంగల్ జిల్లాలో ఉద్యోగులకు ఇంత దారుణం జరుగుతుంటే పట్టించుకునే వారే లేరని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగులకు వారికి జీతాలు ఇవ్వకుండా నెలలు నెలలు కాలం వెల్లదిస్తే,వారి భవిష్యత్ ఏమిటి.వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర విద్యాహక్కు చట్టం 1982 చాప్టర్-14 సెక్షన్-84 ప్రకారంగా ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు చెల్లించాలని తెలియజేసిన ఆ చట్టాన్ని కళాశాల విస్మరించి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. అంతే కాకుండా ఏ ఐ సి టి ఇ విడుదల చేసిన హ్యాండ్ బుక్ పేజి నంబర్ 84 , పాయింట్ 7.4 ను మేము పాటిస్తాం అని తెలియజేసి వారికి ఆఫ్ఫీడవిట్ సంపర్పించరు,కాని అది అమలుపర్చలేదు. అధ్యాపకులకు జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి ఇలాంటి యజమాన్యం పైన రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా శాఖ, జె.ఎన్.టి.యు.హెచ్, ఏ.ఐ.సి.టి.ఇ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా చూడాలన్నారు.  యజమాన్యాము విద్యార్థుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే రియంబర్స్మెంట్ కూడా పొందినప్పటికీ అధ్యాపకుల కు జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబందులకు గురి చేస్తున్నారన్నారు. గణపతి కళాశాల యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి అధ్యాపకుల జీతాలు వెంటనే చెల్లించాలి లేనివెడల జె.ఎన్.టీ.యు.హెచ్ అధికారులకు, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏ.ఐ.సి.టి.ఇ , ఉన్నత విద్యా శాఖ అధికారులు కలిసి సమస్యను వివరిస్తాం, అప్పటికి మీరు స్పందించక పోతే హైకోర్టు వెళ్ళియిన అధ్యాపకులకు న్యాయం జరిగే విధంగా  చూస్తామనీ సంతోష్ కుమార్ అన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image