రేపు గుంటూరు పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

అమరావతి :
*జీఎంసీలో రోగుల అలెవెన్స్‌ పథకం ప్రారంభం.*
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీలో కొత్తగా రోగుల అలెవెన్స్‌ పథకం ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్‌ రెండున గుంటూరుకు వస్తున్నారు.
 గుంటూరు వైద్యకళాశాల జింకానా ఆడిటోరియంలో ఏర్పాటు చేసే కార్య క్రమంలో ఉదయం 11 గంటలకు ఈ కొత్త పథకం సీఎం ప్రారంభిస్తారు.
 సీఎం జగన్‌ టూర్‌ను పురస్కరించుకొని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌ తదితరులు జీజీహెచ్‌, జీఎంసీలో పర్యటించారు.
సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.