శాసనసభ చరిత్రలో దుర్దినం

తేది 10-12-2019.


విలేకరుల సమావేశం వివరాలు .....


శాసనసభ చరిత్రలో దుర్దినం


- ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షసభ్యులకు అవకాశమివ్వకపోవడం దారుణం.


- పార్టీ నుంచి సస్పెండైన వ్యక్తికి ప్రత్యేకస్థానమెలా ఇస్తారు?


- అధికారపార్టీ ఆదేశాలకు అనుగుణంగా స్పీకర్‌ సభ నడుపుతున్నారు.


                శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి (ఎమ్మెల్యే)


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ చరిత్రలో ఈరోజుని ఒక దుర్దినంగా భావిస్తున్నామని, ప్రధానసమస్యలు పరిష్కారమయ్యే ప్రశ్నోత్తరాల సమయంలో, మొదటిగంటలో సభ్యులు అడిగేప్రశ్నలకు గండికొడుతూ, వైసీపీ ప్రభుత్వం కొత్తసంప్రదాయాన్ని సృష్టించిందని టీడీపీసీనియర్‌నేత, ఆపార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తంచేశారు.  అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షనేతైన చంద్రబాబునాయుడికి మైక్‌ ఇవ్వకుండా ఆయన్ని అవమాని ంచడాన్ని నిరసిస్తూ మంగళవారం టీడీపీ సభ్యులందరూ వాకౌట్‌చేశారు. తదనంతరం  గోరంట్ల బుచ్చయ్యచౌదరి విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్షసభ్యులకు మాట్లాడటానికి అవకాశమిచ్చి, ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా చేయడం బాధాకరమన్నారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్న వ్యక్తి, ఆపార్టీకి రాజీనామాచేయకుండా అసెంబ్లీకివస్తే, సదరు వ్యక్తికి ప్రత్యేకస్థానం ఇవ్వాలని స్పీకర్‌లాంటి వ్యక్తే చెప్పడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారితేనే తమపార్టీలో చేర్చుకుంటామని చెప్పిన, జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు టీడీపీనుంచి వెలివేయబడ్డ వ్యక్తికి ప్రత్యేకస్థానం ఎలా ఇస్తారని బుచ్చయ్యచౌదరి ప్రశ్నించారు. గతంలో నేను కూర్చునే స్థానం మార్చాలని అనేకసార్లు కోరినా స్పందించని స్పీకర్‌, నేడు ఉన్నపళంగా ప్రతిపక్షపార్టీ సస్పెండ్‌చేసిన వ్యక్తికి అసెంబ్లీలోస్థానం కల్పించడం దారుణం కాదా అని ఆయన చౌదరి ప్రశ్నించారు. గౌరవంగా వ్యవహరించాల్సిన స్పీకర్‌, ద్వందప్రమాణాలు పాటిస్తున్నాడని,  అత్యున్నతస్థానంలో ఉన్నవారు పచ్చిబూతులు తిడుతున్నా స్పందించకపోవడం విచారకర మన్నారు. సన్నబియ్యానికి, నాణ్యమైన బియ్యానికి తేడాచెప్పమని తాముకోరితే, అదివదిలేసి ముఖ్యమంత్రి మాటతప్పరు.. మడమతిప్పరని డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు. గతంలో సీఎంచేసిన వాగ్ధానాలు, చెప్పినమాటలు చూపించకుండా, వారికి అవసరమైనవాటినే అసెంబ్లీలో ప్రదర్శించారని బుచ్చయ్య పేర్కొన్నారు. ప్రతిపక్షానికి అవకాశమివ్వకుండా మంత్రులతో తిట్టిస్తూ, సభను దారితప్పిస్తున్నారన్నారు. ప్రజలిచ్చిన మెజారిటీని అపహస్యం చేస్తూ, ప్రతిపక్షాన్ని చీల్చేలా రాజకీయాలు చేయడం అధికారపార్టీ మానుకోవాలన్నారు.  స్పీకర్‌ వ్యవహారశైలి ఎలా ఉండాలో ఆయనకే తెలియడంలేదన్నారు. పార్టీ విధానాలకు అనుగుణంగా సభను నడిపితే, రాష్ట్రం ఎటుపోతుందో చెప్పాల్సినపనిలేదన్నారు. తనను గెలిపించిన పార్టీకి రాజీనామా చేయకుండా రెబల్‌గా ఉండే వ్యక్తికి ప్రత్యేకస్థానం ఇవ్వడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమన్నారు.


చెప్పేది చాంతాడంత..చేసేది బెత్తడంత : శ్రీనివాసులు (ఎమ్మెల్సీ)


ప్రజాస్వామ్యంలో ఫోర్త్‌ఎస్టేట్‌గా పిలువబడే ప్రసారమాధ్యమాలను నిషేధించిన రాష్ట్రప్రభుత్వ ం, ఏబీఎన్‌, టీవీ5, ఈటీవీ వంటి ఛానళ్లను బహిష్కరించడం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు తెలిపారు. ఉల్లిధరల పెరుగుదల, పంటలకు గిట్టుబాటు ధర, రైతులసమస్యలపై అసెంబ్లీ, మండలిసాక్షిగా ప్రతిపక్షపార్టీ నిరసనచేపడితే, ప్రభుత్వం     దారుణంగా వ్యవహరించిందన్నారు. మహిళాసభ్యులపట్ల మార్షల్స్‌ వ్యవహరించినతీరుని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చెప్పేది చాంతాడంత, చేసేది బెత్తడంత అన్నట్లుగా ప్రభుత్వపనితీరు ఉందన్నారు. జగన్‌ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్నామన్న అక్కసుతోనే అధికారపార్టీ సభ్యులు ప్రతిపక్షసభ్యులపై తిరుగుబాటు ధోరణితో వ్యవహరిస్తున్నారని శ్రీనివాసులు మండిపడ్డారు. మీరు పసుపురంగు వేస్తే, మేము మాపార్టీ రంగులేస్తున్నామని చెప్పడం పంచాయతీరాజ్‌శాఖా మంత్రి చెప్పడం, అధికారపార్టీ అహంకారానికి నిదర్శన మన్నారు. జాతీయజెండాకు, దేవాలయాలకు, పార్టీ రంగులేస్తూ, దాన్ని సమర్థించుకోవడం సిగ్గుచేటన్నారు. నిషేధించిన ఛానళ్లను స్పీకర్‌, మండలిఛైర్మన్‌ అనుమతించాలని ఆయన డిమాండ్‌చేశారు. ప్రజాస్వామ్యంలో నియంత్రత్వ విధానాలు సరికాదన్నారు.