ప్రవాసాంధ్రులకు అందిస్తున్న వివిధ సేవలలో  ఎక్స్ గ్రేషియా ఒకటి. 


తాడేపల్లి :
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల క్షేమమే ధ్యేయంగా వారికి సేవలందించడంలో రాష్ట్ర  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి  ఆదేశానుసారం ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్) పనిచేస్తోంది.  ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ ప్రవాసాంధ్రులకు అందిస్తున్న వివిధ సేవలలో  ఎక్స్ గ్రేషియా ఒకటి. 
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు  వెళ్లి  ప్రమాదవశాత్తు మృతిచెందిన ప్రవాసాంధ్రుల కుటుంబాలను  ఆర్ధికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి ఇవాళ సొసైటీ  కార్యాలయంలో సంబంధిత 12 బాధిత  కుటుంబాలకు అందజేశారు. 
చెక్కుల పంపిణీ అనంతరం ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ అధ్యక్షులు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ... ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో ఉన్నారని, అందులోను వై.యస్.ఆర్. జిల్లా మరియు ఉభయ గోదావరి జిల్లాల నుండి ఉపాధి కోసం వెళ్ళే వారు  ఎక్కువగా ఉన్నారన్నారు.  వీరు అక్కడ పలు సంస్థల్లో డ్రైవర్లుగా, కాంట్రాక్ట్ కూలీలుగా, గృహ కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దురదృష్టవశాత్తు కొన్ని సందర్బాల్లో అనారోగ్యం బారినపడడం, వృత్తిపరమైన  ప్రమాదాల్లో మృతి చెందడం జరుగుతోందన్నారు. కుటుంబ పెద్ద మృతితో దిక్కు తోచని స్థితిలో ఉన్న  కుటుంబాలకు  ఆర్థిక చేయూతనందించే లక్ష్యంతో  రాష్ట్ర ప్రభుత్వం ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ ద్వారా సంబంధిత మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందిస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ ప్రవాసాంధ్రులకు ఎన్నో సేవలను అందిస్తోందని.. ముఖ్యంగా విదేశాల్లో మరణించిన ప్రవాసాంధ్రులకు మరియు  ఎవరైతే కదలలేని స్థితిలో నిస్సహాయంగా ఉన్నారో అలాంటి వారికి సహాయంగా ఒక సహాయకుడిని ఇచ్చి ఉచిత అంబులెన్స్ సేవ అందించడం, విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఆమ్నెస్టీ (ఆయా దేశాల క్షమాబిక్ష) ద్వారా ఆ దేశ ప్రభుత్వానికి ఇమ్మిగ్రేషన్ జరిమానాలు చెల్లించి, విమాన చార్జీలు, ఆహార ఖర్చులు సమకూర్చి, బాధితులను వారి స్వస్థలాలకు చేర్చడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రవాసాంధ్రులను భారతదేశానికి తిరిగి తీసుకురావడం,  ప్రవాసాంధ్రుల కుటుంబ ఆర్ధిక భద్రతలో భాగంగా ప్రవాసాంధ్ర భరోసా బీమా అందించడం చేస్తోందన్నారు.
చెక్కులను అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు సీఎం జగన్ గారికి, ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ అధ్యక్షులు వెంకట్ మేడపాటికి కృతఙ్ఞతలు తెలిపారు. 
చెక్కుల పంపిణీ కార్యక్రమం లో సీఈఓ (ఇన్ ఛార్జ్ )మల్లేశ్వర రావు, డిప్యూటీ డైరెక్టర్ (ఆపరేషన్స్) మహమ్మద్ కరీం, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు