ఆస్పత్రులు నాడు–నేడు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన సీఎం*  

*18.02.2020*
*కర్నూలు*


*కర్నూలులో వైయస్సార్‌ కంటి వెలుగు మూడవ దశ ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌*
*ఆస్పత్రులు నాడు–నేడు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన సీఎం*  


*సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు:*


*ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం కోసం నాడు–నేడు చేపట్టాం*
*ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాం*
*కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో వాటిని తీర్చిదిద్దబోతున్నాం*
*పేదలు వెళ్లే ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దబోతున్నాం* 
*వైయస్సార్‌ కంటి వెలుగు ద్వారా అవ్వాతాతల కోసం మూడో దశ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాం*
*ఈ విడత కంటి వెలుగులో 56.88 లక్షల మంది అవ్వాతాతలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తాం*
*కళ్లజోళ్లు అవసరమైన వారికి రెండు వారాల తర్వాత గ్రామ వలంటీర్లు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేస్తారు*
*రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గానికి ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మేలు చేస్తున్నాం*
*ఇంత మంచి పరిపాలన చేస్తుంటే, ఓర్చుకోని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది*
*చంద్రబాబును చూస్తున్నారు, వారి కడుపు మంట కూడా చూస్తున్నారు*
*ఆరోగ్యశ్రీలో 2వేల వ్యాధులకు పైగా చికిత్స చేస్తున్నాం*
*ఇంకా క్యాన్సర్‌కు కూడా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం ఉంది*
*కానీ, అసూయతో కూడిన కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు*
*కంటిచూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది కానీ, చెడు దృష్టికి మాత్రం ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు*
*వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి కానీ, మెదడు కుళ్లితే మాత్రం చికిత్స లేనే లేదు*
*అలాంటి లక్షణాలున్న మనుషులను మహానుభావులుగా చూపించే కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు ఉన్నాయి*
*వాటిని బాగు చేసే మందులు కూడా ఎక్కడా లేవు* 
*వీటన్నింటి మధ్య మీ బిడ్డ మీ కోసం పని చేస్తున్నాడు*
*నిజాయితీతో పని చేస్తున్నాం*
*ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం*
*ప్రతి కుటుంబం, అందులో పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా చదువులు చెప్పిస్తున్నాం*
*వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం మీద దృష్టి పెట్టాం* 
*మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో మొదటి ఏడాది కూడా పూర్తి కాకుండానే 85 శాతానికి పైగా అమలు చేసే చర్యలు తీసుకున్నాం*
*కర్నూలు సభలో సీఎం వైయస్‌.జగన్‌*
 
*ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా మార్చబోతున్నాం*
*ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ (ఐపీహెచ్‌ఎస్‌)కు అనుగుణంగా వాటిని అభివృద్ధి చేస్తున్నాం*
*పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏఎహెచ్‌లు, డీహెచ్‌లతో పాటు, టీచింగ్‌ ఆస్పత్రులను కూడా మార్చబోతున్నాం* 
*దీని కోసం రూ.15,335 కోట్లతో పనులు చేపడుతున్నాము*
*జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, కొత్తగా సూపర్‌ స్పెషాలిటీ* *ఆస్పత్రులు, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం*
*ప్రతి పార్లమెంటు నియోజవర్గంలో టీచింగ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం*
*విధంగా మొత్తం 27 వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలలు వస్తాయి*
*మొత్తం 175 నియోజకవర్గాలలో వచ్చే జూలై 31 వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు*
*ఆపరేషన్లు అవసరమైతే మార్చి 1 నుంచి 133 కేంద్రాలు, 11 టీచింగ్‌ ఆస్పత్రులు, 13 జిల్లా ఆస్పత్రులు, 28 ఏరియా ఆస్పత్రులు, 81 ఎన్జీఓ కంటి ఆస్పత్రుల్లో కంటి శస్త్ర చికిత్సలు జరుగుతాయి*


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు