ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.

*11-02-2020*
*అమరావతి*



ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
*సచివాలయంలో ఆటో మ్యుటేషన్‌ సేవల పోస్టర్‌ను విడుదలచేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌*
*హాజరైన రెవెన్యూశాఖ మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌*


*భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్‌) ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు* 
ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో రైతులకు చెందిన క్రయ, విక్రయ భూమి వివరములు రిజిస్ట్రేషను చేయబడినప్పటి రెవెన్యూ రికార్డులలో మార్పులు కొరకు తహసీల్దారు కార్యాలయం మరియు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగవలసి వచ్చేది
అందువలన రైతులకు ఆసౌకర్యం కలుగటయే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఏర్పడింది
ఈ నేపధ్యంలో రిజిస్ట్రేషను చేయబడిన భూముల వివరాలు రెవెన్యూ రికార్డులలో సత్వరం మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యుటేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 
ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కులు మరియు పట్టాదార్‌ పాస్‌బుక్‌ చట్టం, 1971 ను సవరించడం ద్వారా భూ బదలాయింపు వివరాలు రికార్డు చేయడానికి గాను, రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన అధికారులను తాత్కాలిక(ప్రొవిజనల్‌) రికార్డింగ్‌ అధికారులుగా గుర్తింపు
వీరి నియామక అధికారం సంబంధిత జిల్లా కలెక్టర్లదే. 


రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల ఆన్‌లైన్‌ భూమి బదలాయింపు కొరకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా భూ రికార్డుల మార్పిడి నమూనా (ఆర్‌ ఓ ఆర్‌ –1బి, అడంగల్‌) వివరములు ఆన్‌ లైన్‌ ద్వారా రెవెన్యూశాఖకు పంపబడతాయి.


ఈ భూ మార్పిడి వివరాలను మీభూమి పబ్లిక్‌ పోర్టల్‌ ( (www.meebhoomi.ap.gov.in  ) లో సరిచూసుకునే సదుపాయం కూడా కల్పించబడింది


ఆటో మ్యుటేషన్‌ ఫైలట్‌ ప్రాజెక్టు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నందు 2019లో ప్రారంభం
విజయవంతంగా అమలవుతున్న ఆటో మ్యుటేషన్‌ 
ఆటో మ్యుటేషన్‌ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం


*ఆటో మ్యుటేషన్‌ వల్ల ఉపయోగాలు*


భూ రిజిస్ట్రేషన్‌ మొదలు, e - పాసుబుక్‌ జారీ వరకు ఆన్‌లైన్‌లో జరగనున్న మొత్తం ప్రక్రియ
ఇకపై పట్టాదారులు ఆన్‌ లైన్‌ భూ బదలాయింపు కోసం మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు


భూ బదలాయింపు ప్రక్రియ ప్రతి దశలో పట్టాదారు మొబైల్‌ నంబరుకు సంక్షిప్త సమాచారం ద్వారా అందనున్న అప్‌డేట్‌ 


30 రోజుల్లో తహసీల్దార్‌ ధృవీకరణ, తర్వాత రెవెన్యూ రికార్డుల నందు R O R - 1 B లో శాశ్వత నమోదు
అనంతరం  e - పాసుబుక్‌ వెంటనే పొందే అవకాశం


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image