మహారాష్ట్రలో కూడా దిశ వంటి బిల్లును తెచ్చేందుకు కృషి చేస్తాం.

తేది : 20.02.2020
అమరావతి


ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, బాలికల రక్షణకు దిశ బిల్లు తేవడం అభినందనీయం


• దిశ బిల్లు ఒక చారిత్రాత్మకమైన అద్భుతమైన శాసన నిర్ణయం


• ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు పూర్తి వివరాలను,అనుభవాలను తీసుకుంటాం


• మహారాష్ట్రలో కూడా దిశ వంటి బిల్లును తెచ్చేందుకు కృషి చేస్తాం.


• ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు అభినందనీయం: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్


అమరావతి,20 ఫిబ్రవరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణకై ప్రవేశపెట్టిన దిశ బిల్లును చారిత్రాత్మక, అద్భుతమైన శాసన నిర్ణయంగా మహారాష్ట్ర హోంశాఖామంత్రి అనిల్ దేశ్ ముఖ్ కొనియాడారు. మహిళలు, బాలికల రక్షణకై దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకువచ్చిన దిశ చట్టం(బిల్లు) అమలును పరిశీలించేందుకు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి నేతృత్వంలోని గల అధికారుల బృందం గురువారం రాష్ట్రానికి వచ్చింది. ఈ సందర్భంగా అమరావతి సచివాలయం మొదటి భవనంలో రాష్ట్ర హోం, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రుల తోపాటు సిఎస్, డిజిపిలతో సమావేశమై దిశ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా మహారాష్ట్ర హోంశాఖామంత్రి అనిల్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన దిశ బిల్లు తీసుకువచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జనగన్మోహన్ రెడ్డికి హోం,మహిళా శిశు సంక్షేమశాఖల మంత్రులు, సిఎస్, డిజిపి సహా ఈ దిశ బిల్లు అమలుకు కృషి చేస్తున్న అందరికీ ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఇదే విధమైన బిల్లును మహారాష్ట్రలో కూడా తీసుకువచ్చేందుకు అన్నిచర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దిశ బిల్లు తెచ్చిన రెండు మాసాల్లోనే ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్ ను కూడా ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. దిశ బిల్లుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి పూర్తి వివరాలను, సమాచారాన్నిఅనుభవాలను తీసుకుని మహారాష్ట్ర లో కూడా ప్రవేశపెట్టందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.


సమావేశంలో రాష్ట్ర హోంశాఖామంత్రి మేకతోటి సుచరిత ప్రారంభోపన్యాసం చేస్తూ దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరిగే నేరాల అదుపునకు ఈ దిశ బిల్లును తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. దిశ బిల్లును పటిష్టంగా అమలు చేసేందుకు గత రెండు మూడు మూడు మాసాలుగా పెద్దఎత్తున కసరత్తు చేయడం జరుగుతోందని ఇందుకై ఇప్పటికే ప్రభుత్వం రూ. 87 కోట్లు మంజూరు చేయడమైనదని తెలిపారు. నేరం జరిగిన వారం రోజుల్లోగా దర్యాప్తు, 14 రోజుల్లోగా ట్రయల్ పూర్తిచేసి 21 రోజుల్లోగా నేరస్తులకు శిక్షలు పడేరీతిలో దిశ బిల్లును రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకై 13 ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాజిక్యూటర్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని ఇటీవల రాజమండ్రిలో ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించుకోవడం జరిగిందని వివరించారు. దిశ బిల్లుపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కలిగించేందుకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ విధమైన కేసుల సత్వర పరిష్కారానికి ఆధారాలు నమోదుకు దిశ క్రైమ్ డిటెక్షన్ కిట్లను అందించడం జరుగుతోందని ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అంతేగాక దిశ కింద నమోదయ్యే సంఘటనల పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్, ఒన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు హోం మంత్రి సుచరిత వివరించారు. 2020 ఏడాదిని మహిళా రక్షణ రాష్ట్రంగా తీర్చిదిద్దడం,ప్రతి పోలీస్ స్టేషన్ ను స్నేహపూర్వక మహిళా పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సుచరిత మహారాష్ట్ర బృందానికి వివరించారు.


రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు, బాలికల రక్షణకై తీసుకువచ్చిన దిశ బిల్లు ఒక చారిత్రాత్మకమైన బిల్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాదిని మహిళా రక్షణ రాష్ట్రంగా డిక్లేర్ చేసే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి దిశ బిల్లును పటిష్టంగా అమలు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని ఇందుకు ఎన్ని నిధులైనా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలు, బాలికల్లో  ఆత్మస్థైర్యాన్ని ఒక భరోసాను కల్పించే లక్ష్యంతోనే దిశ బిల్లును తీసుకురావడం జరిగిందని తెలిపారు.


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తొలుత సమావేశానికి స్వాగతం పలికి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేసిన తర్వాత దిశ బిల్లును తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ బిల్లు అమలులో భాగంగా పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఈ దిశ బిల్లు అమలు పర్యేవేక్షణకు ఇద్దరు మహిళా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామని చెప్పారు. సంఘటనలు జరిగిన స్వల్ప వ్యవధిలోనే ఆయా కేసుల దర్యాప్తును పూర్తిచేసి నిందితులకు శిక్షలు పడేరీతిలో పటిష్టమైన నిబంధనలతో కూడిన ఈబిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదంతో కేంద్రానికి పంపడం జరిగిందని పేర్కొన్నారు. ఈబిల్లు అమలులో పోలీస్ శాఖ కీలకపాత్ర పోషించనుండగా మహిళా శిశు సంక్షేమం తదితర విభాగాలు కూడా మెరుగైన పాత్ర పోషించనున్నాయని సిఎస్ చెప్పారు.


రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ దిశ కింద నమోదైన కేసుల్లో బాధితులకు సంబంధించిన పరీక్షలు సకాలంలో నివేదికలు అందించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రధాన ఫోరెన్సిక్ ల్యాబ్ లతోపాటు మరో రెండు ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.దిశ ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తేవడం జరిగిందని ఎవరైన మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ఈయాప్ ను ఉపయోగించాలని సకాలంలో సంఘటనా ప్రాంతానికి దిశ సిబ్బంది చేరుకుని వారికి రక్షణగా నిలబడతారని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో దిశ మొబైల్ అప్లికేషన్ ను లక్షా 40వేల మంది డౌన్ లోడ్ చేసుకోగా 10వేల టెస్ట్ కాల్స్ కూడా రాగా వాటిలో 35 యాక్టివ్ కాల్స్ ఉన్నాయని తెలిపారు.ఇప్పటి వరకూ దిశకు సంబంధించి 14 ఎఫ్ఐఆర్ లు రిజిస్టర్ కావడం జరిగిందని డిజిపి సవాంగ్ పేర్కొన్నారు.


దిశ పోలీస్ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దిశ అమలుకు సంబంధించి వివరిస్తూ రాష్ట్రంలో 13 దిశ ఒన్ స్టాప్ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు.రాష్ట్రంలో ప్రప్రథమంగా కృష్ణా జిల్లా కంచికచర్లలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 165 జీరో ఎఫ్ఐఆర్ లను రిజిష్టర్ చేశామని పేర్కొన్నారు.దిశ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించడం తోపాటు మొబైల్ మిత్ర,సైబర్ మిత్రల ద్వారా కూడా ఎప్పటి కప్పుడు పర్యవేక్షించడం జరుగుతోందని తెలిపారు.


దిశ ప్రత్యేక అధికారి కృతికా శుక్లా మాట్లాడుతూ దిశ బిల్లును పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ దిశ బిల్లుతో రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు మరింత రక్షణ చేకూరుతుందని పేర్కొన్నారు.


ఈ సమావేశంలో మహారాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ఆరాష్ట్ర డిజిపి సుభోద్ కుమార్,ఆరాష్ట్ర మహిళా ప్రొటెక్షన్ సెల్ ఐజి డా.డి.ప్రతాప్, మరో ఐజి అశ్వతి డార్జే(Ashwathi Darje),రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అదనపు డిజిపి రవిశంకర్ అయ్యన్నార్, డిఐజి టెక్నికల్ జి.పాల్ రాజు తదితరులు పాల్గొన్నారు


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image