ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన  "పేరుతో రూ.1.70 లక్షల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన  "పేరుతో రూ.1.70 లక్షల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ – బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు


ప్రపంచ దేశాల ఆర్ధిక పరిస్థితులు కరోనా దెబ్బకి తలకిందులైన స్థితిలో భారత్ పై ఆ ప్రభావం తగ్గించడానికి, ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి  కేంద్రం ప్రభుత్వం అతిపెద్ద ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిందని, కరోనా కల్లోలంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు కేంద్రం ఆపన్న హస్తం అందించిందని, "గరీబ్ కల్యాణ్ "పేరుతో రూ.1.70 లక్షల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిందని బీజెపీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు తెలియజేశారు.


కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సందర్భముగా  


పేదలు రోజువారీ కూలీల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని వై.వి. సుబ్బారావు తెలిపారు . లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందనీ, పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్ర్రి నిర్మలా సీతరామన్  ప్రకటించారని తెలిపారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్యం సిబ్బందికి రూ.50 లక్షల మేర హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నట్టు పేర్కొన్నారు. 3 నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్‌ ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన్‌ ద్వారా మరో 5 కేజీల బియ్యం లేదా గోధుమలు ఇప్పటికే ఇస్తున్న 5 కేజీలకు అదనం వీటితో పాటు కేజీ పప్పు సరఫరా చేస్తారని, పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ. పీఎం కిసాన్‌ కింద ఇప్పటికే రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్న కేంద్రం ఇప్పుడు మొదటి విడతగా రూ.2 వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నదని, ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం రూ.202 కు పెంచారని, వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రెండు విడతలుగా రూ.వెయ్యి జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు అందజేస్తారని, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు, డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారని, ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుందని, 90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తిస్తుందని, తమ పీఎఫ్‌ డబ్బు నుంచి 75శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం కేంద్రం ప్రభుత్వం కల్పించినదని, భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.31వేల కోట్లు కేటాయించారని, రాష్ట్రాలకు కేటాయించిన మినరల్‌ ఫండ్‌ను కరోనా వైద్య పరీక్షల కోసం వాడుకోవచ్చునని కేంద్రం తెలిపిందని బీజెపీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు తెలియజేశారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image