లాక్ డౌన్ సందర్భంగా సెక్షన్ 144 crpc నిషేధాజ్ఞలు

.
గుంటూరు :


ఈరోజు అనగా 24-03-20 వ తేదీన గుంటూరు అర్బన్ పోలీస్ అధికారి డిఐజి పిహెచ్.డి రామకృష్ణ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు ఈనెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గుంటూరు అర్బన్ లోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో వాహనాల / ప్రజల సంచారాన్ని నియంత్రించడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాటిని ప్రత్యక్షంగా పర్య వేక్షించుచూ, తగిన ఆదేశాలు జారీచేశారు.


 గుంటూరు అర్బన్ పరిధిలో నిన్నటి రోజు సాయంత్రం లాక్ డౌన్ సందర్భంగా సెక్షన్ 144 crpc నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, రోడ్లమీద అనవసరంగా తిరుగుతున్న ద్విచక్ర వాహన దారులు, నాలుగు చక్రాల వాహనదారులు మరియు నిబంధనలు ఉల్లంఘించి నిత్యావసర వస్తువుల దుకాణాలు కాకుండా ఇతర షాపులు తీసి ఉంచిన 123 మంది మీద 188 ఐపిసి మరియు సంబంధిత ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి, వాహనాలు మొదలైన వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.


 అదేవిధంగా ప్రజా రవాణాను నిషేధించిన ఉత్తర్వులు అమలులో ఉండగా, రోడ్లపై తిరుగుతున్న 107 ఆటోలను పట్టుకొని, కేసులు నమోదు చేయడం జరిగింది. వీరిపై నిబంధనల మేరకు కేసులు నమోదు చేయడం జరిగిందని పి.హెచ్.డి రామకృష్ణ తెలిపారు.


ఈరోజు అనగా 24-03-20 వ తేదీన గుంటూరు అర్బన్ పరిధిలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన 59 మంది పైన 14 కేసులు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా 274 ద్విచక్ర వాహనాలను 66 ఆటోలను నాలుగు కారులను స్వాధీనం చేసు కోవడం జరిగిందని తెలిపారు.


ప్రజలు ఎవరు బయటకు రాకుండా  సహకరించాలని  అని  ఏదైనా నిత్యావసర  సరుకులు  మందులు  వంటి వాటికి  రెండు లేక మూడు కిలోమీటర్ల దూరంలోపు ఇంటిలోని వారిలో ఒక్కరు వచ్చి  ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపుగా మాత్రమే పనులు ముగించుకొని వెంటనే వెళ్లి పోవాలని తెలిపారు ఎనిమిది గంటల తరువాత ఎలాంటి నిత్యావసర దుకాణాలు కూడా ఉండరాదని, ఆతరువాత ఆసుపత్రులు మెడికల్ షాపులు తప్ప అన్నీ మూసివేయాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుచేసి చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.


ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించి కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలాని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారి సమాచారాన్ని  ప్రభుత్వ అధికారులకు తెలియ పరచాలని, జలుబు దగ్గు జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు సమీపంలోని డాక్టర్ ని సంప్రదించాలని,  సోషల్ మీడియా నందు తప్పుడు పోస్టింగ్స్ పెట్టకుండా ఉండాలని, అట్టి వారి పైన చట్టబద్దమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పి.హెచ్.డి రామకృష్ణ తెలిపారు.


అదేవిధంగా ఈ నెల 31వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి కనుక ప్రజా రవాణాకు సంబంధించిన వాహనములు తిరుగరాదు. ప్రైవేటు వాహనములు కూడా సరైన కారణం లేకుండా రెండు మూడు కిలోమీటర్ల పరిధి దాటి రోడ్లపై తిరగరాదని, ద్విచక్ర వాహనాలపై ఒక్కరు, నాలుగు చక్రాల వాహనం పై ఇద్దరు మించి ప్రయాణం చేయ రాదని, అదేవిధంగా నిత్యావసర వస్తువుల దుకాణాలు, మందుల షాపులు వంటివి తప్ప నిత్యవసర వస్తువులుకానీ దుకాణాలు తెరచి ఉంచరాదని, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు పాటించాలని ని ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాల మేరకు కేసులు నమోదు చేయడం, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.