కరోనా నియంత్రణకు కమిటీ ఏర్పాటు
అమరావతి: కరోనా(కొవిడ్ 19) వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా పలు శాఖల కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ కన్వీనర్‌గా వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో ఆర్థిక, హోం, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, యువజనశాఖ ముఖ్య కార్యదర్శులు ఉండనున్నారు. కరోనా నిరోధక చర్యలు, ప్రభుత్వ కార్యాచరణను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
కరోనా నియంత్రణకు కమిటీ ఏర్పాటు