ఓటమి భయంతోనే ఓకే గ్రామంలో ముగ్గురు టిడిపి పార్టీ కార్యకర్తల నామినేషన్ పత్రాలను తిరస్కరించారు,మంత్రి సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట ఏది,టిడిపి ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ వెల్లడి
,కర్నూలు,మార్చి,13 (అంతిమతీర్పు-బ్యూరో):-కర్నూలు జిల్లాలోని ఎంపీటీసీ జెడ్పిటిసి నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరడంతో నామినేషన్ల ఉపసంహరణ కోసం వైసీపీ ఆగడాలు రోజురోజుకూ అంతు లేకుండా పోయిందని ఆలూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ తెలిపారు.హోళగుంద మండలంలోని హెబ్బటం గ్రామంలో ముగ్గురు టిడిపి కార్యకర్తలు వేసిన ఎంపీటీసీ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తిరస్కరించడంతో నామినేషన్ వేసిన టిడిపి ఎంపిటిసి అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఇదంతా వైసిపి ఓటమి భయంతోనే,ఆలూరు నియోజకవర్గం మంత్రి ఇలాకాలో ఉండడంతోనే ఎన్నికల అధికారులు,పోలీసు సిబ్బంది అధికార పార్టీకి చెందిన నాయకులు మాటలు విని టిడిపి పార్టీకి చెందిన ఎంపిటిసి అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించినందుకు గ్రామంలోని టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఇరు పార్టీలకు చెందిన నాయకులు రాళ్ల వర్షం కురిపించడంతోటిడిపికార్యకర్తలకు