*ఆవేదనకు గురైన పోలీసు కానిస్టేబుళ్ళు*
వింజమూరు (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) మీ మంచి కోరుతుంటే మాకు ఎదురు తిరగటం ఎంతవరకు సమంజసమని విధి నుర్వహణలో ఉన్న వింజమూరు పోలీసు సిబ్బంది శనివారం నాడు ఆవేదనకు గురయ్యారు. వివరాలలోకి వెళితే స్థానిక బంగ్లాసెంటర్ వద్ద కొంతమంది కానిస్టేబుళ్ళు విధులు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లాక్ డౌన్ సమయంలో రోడ్లు మీద తిరగకూడదని, పైగా మాస్కు ధరించకపోవడం ఏంటని ప్రశ్నించారు. దీంతో ద్విచక్రవాహనదారునికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్నానికంగా తిరుగుతున్న పాత్రికేయులు ఈ విషయాలను గమనించి సర్ధి చెప్పడంతో వివాదం సద్దుమణిగిపోయింది. అనంతరం పోలీసు సిబ్బంది తీవ్రమైన మనోవ్యధకు గురయ్యారు. కరోనా వైరస్ రాకుండా ఉండేందుకే ప్రజలను రోడ్లు మీదకు రావద్దని చెబుతూ మీ ప్రాణాల కోసం మా ప్రాణాలను పణంగా పెడుతున్నామని, మీ లాగా మేము కూడా మనుషులమేనని, మీ కుటుంబాలతో కొద్ది రోజుల పాటు నివాసాలలో ఉండి ఆనందంగా ఉండాలని, మీ కోసం మేము మా కుటుంబాలకు దూరంగా ఉంటూ రేయనక, పగలనక నిద్రలేని రాత్రులను గడుపుతున్నామని తమ భాధను వ్యక్తం చేయడంతో పాత్రికేయులకు సైతం కళ్ళు చెమ్మగిల్లాయి.