పొత్తూరి వెంకటేశ్వరరావు నేటి జర్నలిస్ట్ లకు ఆదర్శం-సంతాప సభలో APJF జిల్లా అధ్యక్షులు శాఖమూరి శ్రీనివాసులు
ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరు వెంకటేశ్వరరావు ఆకస్మిక మరణం జర్నలిస్ట్ లకు తీరని లోటు అని నెల్లూరు జిల్లా APJF జిల్లా అధ్యక్షులు శాఖమూరి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు లోని స్థానిక ఓ హోటల్ లో ఆయన సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరరావు జర్నలిస్ట్ వృత్తి పట్ల ఎంతో నిబద్ధతగా వ్యవహరించారని,ఆయన లేని లోటు ఎంతో బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రఘాఢ సానుభూతిని తెలియజేసారు. APJF నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షులు ఆకుల పురుషోత్తం (బాబు సింహపురి బాబు) మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ పొత్తూరు వెంకటేశ్వరరావు ప్రజల కోసం నిలిచిన గొంతులని నిర్భధించినప్పుడు గళమై నిలిచి పాటుపడిన ఆయన కల్లోల సమయంలో నిష్క్రమించటం ఎనలేని సూన్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బుసింగ్,ట్రజరర్ మల్లికార్జున జాయింట్ సెక్రటరీలు,జయకుమార్ సింగ్ దిలీప్ ,రఫీ తడాఖా వెంకటేశ్వర్లు ఈ సి మెంబర్లు ,శ్రీనివాసులు షేక్ బాబు,నరసింహులు,మణి
జర్నలిస్ట్ లు,అంతిమ తీర్పు దినపత్రిక ఎడిటర్ వల్లూరు ప్రసాద్ కుమార్,ప్రయోక్త రమేష్ రవి శంకర్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పొత్తూరి వెంకటేశ్వరరావు నేటి జర్నలిస్ట్ లకు ఆదర్శం : apjf నెల్లూరు జిల్లా కమిటీ