ధరల నియంత్రణకు వింజమూరు తహసిల్ధారు చర్యలు

*ధరల నియంత్రణకు వింజమూరు తహసిల్ధారు చర్యలు* వింజమూరు (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో నిత్యావసర వస్తువుల ధరలకు డిమాండ్ సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని దుకాణాదారులను తహసిల్ధారు సూధాకర్ రావు హెచ్చరించారు. ఇందులో భాగంగా కూరగాయల దుకాణాల ముందు భాగంలో శనివారం నాడు వివిద రకాల కూరగాయలకు నిర్ణీత ధరలను ప్రకటిస్తూ ధరల పట్టికలను ఏర్పాటు చేసి దుకాణాల వద్దనే తిరుగుతూ అమ్మకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్ధారు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ ప్రకటించడం జరిగిందన్నారు. ప్రజలకు నిత్యావసరాలైన కూరగాయలు, మెడికల్ షాపులు, కిరాణా కొట్లు, పాల కేంద్రాలకు మాత్రమే నిర్ధేశిత సమయాలను తెలియపరిచి అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. వాటిని ఆసరాగా చేసుకుని ఎవరైనా వ్యాపారులు సాకులు చెబుతూ ధరలు పెంచితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెంచితే అందుకనుగుణంగా ఉన్న చట్టాలను ప్రయోగించి కేసులు నమోదు చేస్తామన్నారు. తహసిల్ధారు తెల్లవారుజాము నుండే అన్ని దుకాణాలను పరిశీలిస్తూ క్యూ పద్దతిలో వేచి ఉన్న కొనుగోలు దారులకు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ముఖ్యమని, నిత్యావసర సరులుల కోసం ఇంటి నుండి ఒక్కరే రావాలని సలహాలిస్తూ వినూత్న తరహాలో ప్రచారం నిర్వహించారు.