ఇది అరుదుగా వచ్చే విపత్తు.. పరిస్థితి చేయిదాటే విధంగా చేసుకోవద్దు: విజయసాయిరెడ్డి
కరోనా ఆంక్షలను ప్రజలు తూ.చ తప్పకుండా పాటించాలి
దేశంలోనే అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్రంగా ఏపీ ముందుంది
సీఎం జగన్ గారు చెప్పిన సూచనలు పాటిస్తూ ఇళ్లలో ఉండండి
ప్రజలు లాక్‌డౌన్‌ను పాటించకుండా బయట తిరిగి పరిస్థితి చేయిదాటే విధంగా చేసుకోవద్దని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. ప్రభుత్వ సూచనలను పాటించాలంటూ ఆయన ట్వీట్ చేశారు.
'కరోనా ఆంక్షలను ప్రజలు తూ.చ తప్పకుండా పాటించాలి. ఇది అరుదుగా వచ్చే విపత్తు. దేశంలోనే అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్రంగా ఏపీ ముందుంది. బయట తిరిగి పరిస్థితి చేయిదాటే విధంగా చేసుకోవద్దు. సీఎం జగన్ గారు చెప్పిన సూచనలు పాటిస్తూ ఇళ్లలో ఉండి సమాజానికి మన వంతు తోడ్పాడునందించాలి' అని ప్రజలను కోరారు.