నాడు గర్తుపురము - నేడు గుంటూరు 

*ఘనమైన   జిల్లా  మన గుంటూరు* 
              *జై కొట్టు గుంటూరు కు సోదరా*  
నాడు గర్తుపురము 
నేడు గుంటూరు 
చాళుక్యుల చతురత గలగిన గర్తుపురం
పల్లవులు పాలించిన గర్తుపురం 
వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 
     ఏలిన గర్తుపురం 


అగస్త్య మహర్షి  ప్రతిష్టించిన శివాలయము 
గల గర్తపురo 
 


  
ఈడేరు శాసనం గల గర్తుపురం 
తిక్కన పూర్వీకులు  నివాసం  గర్తుపురం 
ప్రఖ్యాత కోహినూరు వజ్రం లభించిన గర్తుపురం 
ఘనమైన ప్రదేశం మా గర్తుపురం 


   ఇది కళలకు కాణాచి,
 పండితులకు పసిడి అరుగు, 
సత్కవులకు సన్నిధి, 
పౌరుషాలకు పురిటి  గడ్డ ,
ఆధ్యాత్మిక భావ కల్పలతకు ఆలవాలం ,
రాజకీయాలకు రచ్చబండ,
చదువుల తల్లికి చలువ పందిరి,
ఇన్ని మాటలేల   ఘనత మీరిన 
గర్తుపురి సీమ     ఆంధ్రమాత  కంఠ సీమలో 
   కమనీయ మణిహారము 


గుంటూరు  గోంగూర  రుచి 
గుంటూరు క్రేన్ వక్క పలుకులు 
గుంటూరు   కారం  ఘాటు 
గుంటూరు చాంతాడు 
గుంటూరు పుగాకు  
గుంటూరు పత్తి 


అమరావతి బుద్ధుడు 
అమరావతి కాలచక్రం 
నాటి రాజధాని ధరణికోట 
నేటి రాజధాని అమరావతి


నంది కొండ కు పడవ ప్రయాణం 
నాగార్జున సాగరము యానము 
ఎత్తిపోతల జలపాతము కింద  స్నానము 
పరవససించు గదా మన మననము 


మంగళగిరి నారసింహుడు 
అమరావతి అమరలి౦గేశ్వరుడు 
కాకాని మల్లెశ్వరుడు 
మాచెర్ల చేన్నకేశవుడు  
పొన్నూరు  భారీ అంజనేయుడు  
చేబ్రోలు చతుర్ముఖ  బ్రహ్మ దేవుడు 
బాపట్ల భావన్నారాయణుడు 
కారంపూడి చేన్నకేశవుడు
క్వారీ బాల కోటేశ్వరుడు
నాగులపాడు నాగేంద్రుడు 
చిలుమూరు ఉభయ రామేశ్వరుడు


కాలే మస్తాన్ షా  ఉరుసు సడి 
నదుల సంగమం జాగర్లమూడి 
వడ్లమూడి విజ్ఞాన్ గ్రూప్ సవ్వడి     


వైకుత పురము లో ఉత్తరoగ వాహిని 
 
  


మొదటి హైకోర్టు గల జిల్లా 
ఆంధ్ర పారిస్  తెనాలి ఇక్కడే 
సీత జాడ శ్రీరాముడు విన్న ప్రదేశo 
   వినుకొండ  ఇక్కడ 


ఉప్పలపాడులో  పక్షుల గలగల 
వీధి వీధికి రామనవమి పందిళ్ళు కళకళ 
కోటప్పకొండ ప్రభలు పరవళ్ళు 
క్వారీ శివరాత్రి తిరుణాళ్ళు


కొడవీటి కోట
ఫిరంగిపురము  తూట
హాయి లాండు  బాట
మానస సరోవరములో  ఓ పూట  
బ్రహ్మా నందరెడ్డి స్టేడియం లో ఆట 
ఉండవల్లి గుహలు కలవిచ్చోట 


భజరంగ్ జూట్ మిల్లు 
తాడేపల్లి కె సి పి సిమెంట్  
పాపులర్  షూ మార్ట్
పిడుగురాళ్ళ సున్నపు పరిశ్రమ 
xxx సోప్ ఫ్యాక్టరీ 
క్రేన్  వక్కపలుకుల పరిశ్రమ 
టెక్స్ టైల్  పరిశ్రమలు 
ఐ టి  సి   జోసిల్   కాటన్ మిల్స్ 
ఘనమైన పరిశ్రమలు గలవిచట 


లాం వ్యవసాయ పరిశోధనాలయం 
బాపట్ల వ్యవసాయ యూనివర్సిటీ 
ఆచార్య నాగార్జున  యూనివర్సిటీ 
జాగర్లమూడి పాల కేంద్రము   
పెద్ద పలకలూరు కుందేళ్ళు వనము 
పెరేచెర్ల రిజర్వ్ ఫారెస్ట్ 


వడ్లముడి  నారింజ
అంగలకుదురు అరటి ఆకులు 
దుగ్గిరాల పసుపు కొమ్ములు 


ప్రకాశం  బారేజి  
కృష్న పై రైలు వంతెన 
కొల్లూరు ఇటుక 
పిడుగురాళ్ళ సున్నమ్ 
మాచెర్ల నాప రాయి   
గుంటూరు నార సంచులు 
గుంటూరు చేనేత చీరలు 


పలనాటి యుద్ధము   
గౌతముని  భోదనము 


 
పలనాటి నాగమ్మ రాజనీతి 
బ్రహ్మ నాయుడి సహబంతి 


బాపట్ల సూర్యలంక 
ఫిరంగిపురము చర్చి 


అనండ భవన్ భోజనము 
మైసూర్ కేఫ్ సాంబారు ఇడ్లి 
పూల బజారులో  మార్వాడి నేతి స్వీట్స్ 
 
జిన్నా టవర్ సెంటర్ 
శoకర విలాస్ కూడలి 
 మాయబజారు పాత సామాను 
ఏకా దండయ్య పంతు హాలు 
వెంకటేశ్వర విజ్ఞాన  మందిరము 


దైవ స్వరూపులు 
శ్రీ నారయణ తీర్డులు,  శ్రీ కుర్తాలం పీఠాదీపతి,
 విశ్వం యోగి ,జిల్లేల్ల  మూడి  అమ్మ, 
శృ౦గేరి  పీఠాదీపతి  భారతీ తీర్ధ  
  పవిత్ర జన్మ స్థలము 


 గాయకుడు శ్రీ తూము లక్ష్మి నరసింహదాసు జన్మస్ధలము


ప్రఖ్యాత  కళాకారులు జన్మస్ధలము మా గుంటూరు కదా 
మహానటి సావిత్రి 
గాయని ఎస్  జానకి ,  గాయకుడు నాగురు బాబు , కంచు కంఠ౦  కొంగర జగ్గయ్య,  
కొసరాజు , ,గుమ్మడి ,
ఘట్టమనేని కృష్ణ ,చక్రపాణి,
కాంచనమాల ,చిత్తూరు నాగయ్య 
డీ వి నరసరాజు,ధూళిపాల ,గాయని  కౌసల్య


 పిఎల్ నారాయణ
 బలిజేపల్లి లక్ష్మి  కాంతం ,
భార్గవి,మన్నవ బాలయ్య,
మిక్కిలినేని ,ముక్కామల 
ముదిగొండ లింగమూర్తి ,
 రాజ్యలక్ష్మి ,శారద, శ్రీరంజని సోదరీమణులు 
సి యస్ ఆర్,  స్ధానం నరసింహా రావు  ,
 ఏ వి యస్  ,   బ్రహ్మానందం  , ఈలపాట రఘురామయ,
పావలా శ్యామల  ఈ జిల్లలలోనే పుట్టారు
జమున దుగ్గిరాల  లోనే పెరిగింది 
 
చందమామ చక్రపాణి జననం ఇక్కడే 
ప్రఖ్యాత కవులు   
తెనాలి రామకృష్ణ ,కొప్పరపు సోదర  కవులు , 
జంధ్యాల పాపయ్య శాస్త్రి,  గుర్రం జాషువా ,తుమ్మల సీతారామ శాస్త్రి  , బొల్లిముంత ,మునిమాణిక్యం ,లల్లాదేవి,శ్రీ రమణ,సముద్రాల ద్వయము,  సత్యవతి,   వాసిరెడ్డి ,కొడవగంటి, గాజుల సత్య నారాయణ ,నాయని కృష్ణ  కుమారి కొండవీటి  వెంకట కవి, మొవ్వ వృషాద్రిపతి, ఎక్కిరాల సోదరులు,  మహా మహోపాద్యాయ కొక్కొండ వెంకట రత్నo  పంతులు,   గుంటూరు జిల్లాలోనే జన్మించారు 


ముఖ్య మంత్రులు  కాసు బ్రహ్మానందరెడ్డి .భవన వెంకట రామి రెడ్డి, కోoజేటిరోశయ్య ఇక్కడే జన్మించారు 


సచివులు 
 కొత్త రఘురామయ్య రాయపాటి, కన్నా ,జూపూడి యజ్ఞ నారాయణ, గవర్నర్  కోన ప్రభాకర రావ్ స్పీకర్  కోడెల శివప్రసాద్   స్వాతంత్ర్య సమరయోదులు  వావిలాల గోపాల కృష్ణయ్య ఉన్నవ లక్ష్మి నారయణ కన్నెగంటి హనుమంతు గోగినేని భారతి  కొండా వెంకటప్పయ్య ఇక్కడే జన్మించారు 
చదువల కాణాచి  ధన్  గారి రవి కాలేజి 
ముఖ్యమంత్రులు ఎన్టీఆర్   భవనం,రోశయ్య ,కాసు ,ప్రముఖులు యెన్ జి రంగా ,కరుణశ్రీ   సినిమా కళాకారులు శోభన్ బాబు ,కొంగర, వాసంతి   చదివిన ఏ సి  కాలేజి 
ప్రసాద రాయ కులపతి గారు చదివిన హిందు కాలేజి 


ఘనులు వి వి యస్  లక్షన్,     ఎం ఎస్ కె ప్రసాద్,      అంబటి రాయుడు  ఇక్కడే పుట్టారు,   ద్రోణవల్లి హారిక 
పాపులర్  పాదరక్షల యజమాని చుక్కపల్లి పిచ్చయ్య   పొలిసు ఉద్యోగి ఉమేష్ చంద్ర  రెడ్డీస్  ల్యాబ్  అంజిరెడ్డి, పండితా రాధ్యుల నాగేశ్వర రావు,పుచ్చ పూర్ణానందము   పొత్తూరి వెంకటేశ్వర రావు   మంతెన సత్యనారాయణ రాజు   యలవర్తి నాయుడమ్మ, హేమలతా లవణం ,  జన్మించిన జిల్లా  
తెలుగు హనుమాన్ చాలీసా గాయకుడు శ్రీ యం యస్ రామారావు జననం ఇచ్చటే
 


ఊరగాయలో రారాజు  
ఆవకాయ   
ఆవకాయ కు కావాలి  మా గుంటూరు కారము 
(MIRCHI) లో  ఆరు అక్షరాలు   GUNTUR లో అక్షరాలు ఆరు 


మా గుంటూరు  ఘనమైన జిల్లా,  మా గుంటూరు  ఉన్నతమైన జిల్లా, మా గుంటూరు  గొప్ప జిల్లా   మా గుంటూరు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జిల్లా  


చెప్పాలంటే ఇంకా ఎన్నో .......ఎన్నో .... ఎన్నో    అందుకే  ఒకసారి వేయండి మీ టూర్   మన గుంటూర్ కు .


🙏