సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. అమరావతి రాజధాని ఉద్యమం నేటికి 100 రోజులు పూర్తి చేసుకుందన్న విషయం గుర్తు చేశారు.
ఇకనైనా విరమించుకోండి! : ‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ అమరావతిలో మొక్కవోని దీక్షతో రైతులు, మహిళల ఆందోళన చేస్తున్నారు. వైసీపీ తప్ప ఎవరూ 3 రాజధానులను అంగీకరించడంలేదు. రాజధాని భూముల విషయంలో హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. ఇప్పటికైనా మొండిపట్టు వీడి మూడు రాజధానుల ఏర్పాటు విరమించుకోవాలి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలి’ అని  లేఖలో రామకృష్ణ రాసుకొచ్చారు.