రేషన్ షాపులు తనిఖీ చేసిన తహసీల్దార్

రేషన్ షాపులు తనిఖీ చేసిన తహసీల్దార్
వరికుంటపాడు  :మూడో విడత ఉచిత రేషన్ పంపిణి కార్యక్రమం లో భాగంగా వరికుంటపాడు తహసీల్దార్ చేవూరి శ్రీనివాసులు బుధవారం పలు రేషన్ షాప్ లను తనిఖీ చేసారు. బయోమెట్రిక్ వేయడం తప్పనిసరని ఇందుకు సంబంధించి ప్రతి వినియోగదారుడు మాస్క్ లు ధరించి, శానిటైజర్ ని వాడాలన్నరు, ప్రతి వ్యక్తి సమదూరం పాటించాలన్నారు. ఈ సందర్భంగా తూర్పు బోయమడుగుల, గువ్వడి రేషన్ దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ వివరాలు, రిజిస్టర్లు పరిశీలించారు.కరోనా కట్టడి కి కృషి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.