జిల్లా కలెక్టర్లు, కోవిడ్‌ ఆస్పత్రుల వైద్యులతో సీఎం వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

*అమరావతి*


*జిల్లా కలెక్టర్లు, కోవిడ్‌ ఆస్పత్రుల వైద్యులతో సీఎం వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌..*


అంకిత భావంతో మన రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు..


లాక్‌డౌన్‌ నుంచి, అంతకుముందు నుంచి కూడా మీరు సర్వీసులు ఇస్తున్నారు..


రాష్ట్రానికి సంబంధించి నాలుగు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రుల్లో ఉత్తమ వైద్య సేవలను అందించడానికి గుర్తించాం..


జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రులు, అలాగే క్రిటికల్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా వైద్యసేవలు అందించే క్రమంలో రిస్కు ఉంటుందని తెలిసినప్పటికీ కూడా చాలా కష్టపడి ఈ సేవ చేస్తున్నారు..


తెలియని భయం ఉన్నప్పటికీ కూడా మీరు వైద్య సేవలు అందిస్తున్నందుకు నేను సెల్యూట్‌చేస్తున్నాను..


ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా కేసులు సంఖ్య పెరిగింది..


పూర్తిగా వారందర్నీ ట్రేస్‌ చేసి వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను, సెకండరీ కాంటాక్ట్స్‌ను పూర్తి క్వారంటైన్‌ లేదా? ఐసోలేషన్‌లో పెట్టాం..


మొత్తమ్మీదకు చూస్తే పరిస్థితి అదుపులో ఉందనే చెప్పుకోవచ్చు..


రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నాను..


మీరందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా..


*ఏపీ సీఎం జగన్*