*'సుంకర' సేవలు స్ఫూర్తిదాయకం*
వరికుంటపాడు
ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు అయిన సుంకర సోదరుల సేవలు స్ఫూర్తిదాయకం అని ఎస్ఐ ఉమా శంకర్ అన్నారు.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్న వారిని గుర్తించి ఆదివారం సుంకర చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు సుంకర వేంకటాద్రి అందించిన నిత్యావసర సరుకులను ఎస్ఐ చేతుల మీదగా పంపిణి చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఊరుకి ఉపకారం చేసే ఇలాంటి శ్రీమంతులు మరెన్నో సేవాకార్యక్రమాలు చేపట్టాలని కోరారు.పంచాయతీ లోని వరికుంటపాడు, ఆంధ్రవారిపల్లి, కనియంపాడు, జంగంరెడ్డిపల్లి లోని ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు సరుకులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ మట్లే హరినారాయణ, మాజీ ఉప సర్పంచ్ సుంకర రాధాకృష్ణ, మండల తెలుగు యువత అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, నాయకులు పొద మాధవ రావు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
సరుకులు పంపిణి చేస్తున్న వరికుంటపాడు ఎస్ఐ