హోంమంత్రి మేకతోటి సుచరిత చొరవతో సొంత ఊర్లకు పయనమవుతున్న వలస కూలీలు.

*గుంటూరు  ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు) :


హోంమంత్రి మేకతోటి సుచరిత చొరవతో సొంత ఊర్లకు పయనమవుతున్న వలస కూలీలు.


కర్నూల్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో గుంటూరు జిల్లా కు వచ్చిన వలస కూలీలు.


లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడే ఉండిపోయిన మిర్చి కూలీలు, ఇతర వలస కూలీలు.


తమ ఇబ్బందులను హోంమంత్రి సుచరిత దృష్టికి తీసుకొచ్చిన కూలీలు.


వృద్ధులను, పిల్లలను సొంత ఊరిలో వదిలేసి వచ్చామని తమ గోడును హోంమంత్రి తో చెప్పుకున్నారు.


సానుకూలంగా స్పందించిన హోంమంత్రి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు.


ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వలస కూలీలను సొంత గ్రామాలకు పంపించేందుకు సన్నాహాలు.


కర్నూలు జిల్లా లోని గ్రీన్ జోన్ లో ఉన్న కూలీలను పంపించేందుకు ఏర్పాట్లు.


కోసిగి, దేవరకొండ మండలాలకు చెందిన వలస కూలీల కోసం 8 బస్సులను ఏర్పాటు చేశారు.


మల్లయపాలెం లో 9 బస్సులు, వంగిపురం లో 5, ప్రత్తిపాడు లో  3, మేడవారి పాలెం లో 2 బస్సులను ఏర్పాట్లు చేశారు.


సొంత గ్రామాలకు పంపిస్తున్నందుకు హోంమంత్రి మేకతోటి సుచరిత కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వలస కూలీలు.