*కే.జి.ఆర్.వి.ఎస్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం

*కే.జి.ఆర్.వి.ఎస్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం* (వింజమూరు తహసిల్ధారు సుధాకర్ రావు) వింజమూరు, ఏప్రిల్ 12 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) వింజమూరు మండలంలో కొండా.గరుడయ్య, రామచంద్రయ్య, వెంకటసుబ్బయ్య (కే.జి.ఆర్.వి.ఎస్ చారిటబుల్ ట్రస్ట్) ల సేవలు ప్రశంసనీయమని వింజమూరు తహసిల్ధారు యం.వి.కే. సుధాకర్ రావు కొనియాడారు. ఆదివారం నాడు స్థానిక కొండా వారి నివాసం వద్ద పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులైన వంట సరుకులు పంపిణీ చేశారు. యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ మాట్లాడుతూ వింజమూరు మండలంలో ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో కే.జి.ఆర్.వి.ఎస్ ట్రస్ట్ విశేష సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా దాతలు సేవా కార్యక్రమాలు నిర్వహించే సమయాలలో తప్పనిసరిగా అందరూ సమదూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మండలాధ్యక్షుడు గణపం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్ధికంగా స్థితిమంతులైన కొండా వంశస్థులు చారిటబుల్ ట్రస్ట్ పేరిట సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. వై.సి.పి మండల కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి మాట్లాడుతూ కే.జి.ఆర్.వి.ఎస్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు లాక్ డౌన్ సమయంలో రజకులకు, కాలనీవాసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టులకు నిత్యావసరాలు అందజేస్తూ తమ దాతృత్వమును చాటుకుంటూ కీర్తి ప్రతిష్టలు గడిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కొండా.బాలసుబ్రహ్మణ్యం, కొండా.వెంకటేశ్వర్లు, కొండా.వెంకట సుబ్బారావు, కొండా.చిన వెంకటేశ్వర్లు, కొండా.చిన సుబ్బారావు, కొండా.సుమన్, దుగ్గి.మధు, చర్షిత, షామిలి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.