రిషి కపూర్ మృతికి ఎఫ్ డి సి చైర్మన్ విజయ్ చందర్ సంతాపం

 


విజయవాడ, ఏప్రిల్ 30: సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు రిషికుమార్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది సంస్థ   చైర్మన్   టి.ఎస్.విజయ్ చందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేరా నామ్‌ జోకర్‌ చిత్రంలో బాల నటుడుగా,  ‘బాబీ’ చిత్రంతో హీరోగా సినీ ప్రస్థానం  ప్రారంభించిన రిషి కపూర్ మరణంతో సినీ ప్రపంచం గొప్ప  దిగ్గజాన్ని కోల్పోయిందని   విజయ్ చందర్ అన్నారు. తొలి చిత్రంతోనే బాల నటుడిగా జాతీయ పురస్కారం పొందిన రిషి కపూర్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి   విజయ్ చందర్ ప్రగఢ సానుభూతి వ్యక్తం చేశారు.