ల్యాబ్ లు లేని మిగిలిన జిల్లాల్లో ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయం :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

*25–04–2020*
*అమరావతి


కోవిడ్‌ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష


*అమరావతి: 
కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
*క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు, అధికారులు హాజరు.


కోవిడ్‌ లాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఆరోగ్యరంగంలో మౌలికసదుపాయాలను మెరుగుపర్చుకోవడం చాలా అవసరమన్న సీఎం
గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయన్న సీఎం.
ల్యాబులు లేని మిగిలిన జిల్లాల్లో ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
శ్రీకాకుళం జిల్లాలో కేసులు వెలుగు చూసినందున ఒక మంచి అధికారిని అక్కడ పెట్టాలని సీఎం ఆదేశం
ఇదివరకే నిర్ణయించిన విధంగా కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలన్న సీఎం


నిన్న ఒక్కరోజే 6928 పరీక్షలు చేయించామన్న అధికారులు
ఇప్పటివరకూ 61,266 పరీక్షలు చేసిన ఏపీ 
ప్రతి మిలియన్‌ జనాభాకు 1147 పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఏపీ 


*టెలిమెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని సీఎం ఆదేశం*
కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాకుండా వారికి మందులు కూడా పంపించాలని, దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్న సీఎం.
టెలిమెడిసిన్‌కు 14410 కు మరింత ప్రచారం కల్పించాలన్న సీఎం


కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ అనుమతించిన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలన్న సీఎం
అక్కడ పనిచేస్తున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించాలన్న సీఎం


*జనతాబజార్ల ఆలోచనకు మంచి మద్దతు లభిస్తుందన్న వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు*


*కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పారిశుధ్య కార్యక్రమాలు, కోవిడ్‌ –19 నివారణా చర్యలపై ప్రజలనుంచి అభిప్రాయాలు తీసుకున్నామన్న మంత్రి బొత్స సత్యనారాయణ*
ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామన్న  మంత్రి బొత్స
ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం



సమావేశంలో డిప్యూటీ సీఎం అళ్లనాని, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, కురసాల కన్నబాబు, సీఎస్ నీలంసాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు