10వ తరగతి పరీక్షలు ప్రస్తుతం నిర్వహించలేకపోతున్నాం.:విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ :

తాడేపల్లి.ఏప్రిల్ 14.:


రాష్ర్ట విద్యాశాఖమంత్రి  ఆదిమూలపు సురేష్ :


లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు ప్రస్తుతం నిర్వహించలేకపోతున్నాం.


పరీక్షలు జరిగేంత వరకు విద్యార్దులకు సీఎం శ్రీ వైయస్ జగన్  ఆదేశాలు మేరకు ఆన్ లైన్లో సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు బోధించడం జరుగుతుది.


విద్యార్దులు ఇంటివద్దనే ఉండి సప్తగరి ఛానల్ ద్వారా రోజుకు రెండుగంటలపాటు  ఉదయం 10 గంటనుంచి 11 గంటలవరకు , సాయంత్రం 4 గంటలనుంచి 5గంటలవరకు పాఠ్యాంశాలబోధన ప్రసారం అవుతాయి.


పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి.ఆ సబ్జెక్టులను అర్దంచేసుకోవాలనే అంశాన్ని తీసుకుని విద్యామృతం అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.విద్యామృతం కార్యక్రమాన్ని విద్యాశాఖ,సాంఘికసంక్షేమం, గిరిజనసంక్షేమం,వెనకబడిన తరగతుల సంక్షేమం,మైనారిటీల సంక్షేమం శాఖల పరిధిలో స్కూళ్లలో పనిచేస్తున్న అధ్యాపకులను ఎంపిక చేయడం జరిగింది.


వారిద్వారా ఈ తరగతులను నిర్వహించడం జరుగుతుంది.దీనికి ఇప్పటికే ట్రయిల్ రన్ నిర్వహించాం. 


రాష్ర్టంలో షుమారు ఐదులక్షలమంది విద్యార్దులు వాటిని వీక్షిస్తున్నారని తెలియచేస్తున్నాం.క్లాస్ వర్క్ మిస్అయినా కూడా అవే క్లాసులను యూట్యూబ్ సప్తగిరి ఛానల్ లో కూడా అందుబాటులో ఉంచుతాం.


యూట్యూబ్ ఛానల్ ను కూడా 1.50 లక్షలమంది విద్యార్దులు చూశారు.కాబట్టి విద్యార్దులకు విజ్ఞప్తి ఏంటంటే విద్యార్థులు సమయాన్ని వృధా చేయవద్దు... ఈ క్లాసులను వినియోగించుకోండి అని చెబుతున్నాను.


టివి ఎదుట కూర్చుని క్లాసెస్ ను విద్యార్దులు వినాలని,వారినిసరైన విధంగా మోటివేట్ చేయాలని తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.


క్లాసెస్ నిర్వహణకు పకడ్బందీగా రూపకల్పన చేయడం జరిగింది.ఇందుకోసం ఉన్నతాధికారులతో స్టీరింగ్ కమిటిని ఏర్పాటుచేశాం.


ఆన్ లైన్  లో పాఠాలు చెప్పడానికి ఉత్సాహం ఉన్న ఉపాధ్యాయులు కూడా ముందుకురావచ్చు.వన్ ఆర్ టూ మినిట్ వీడియోలను తయారుచేసి పంపిస్తే వారిని సైతం ఆన్ లైన్ క్లాస్ వర్క్ లో ఉపయోగించుకునేవిధంగా ప్లాన్ చేస్తాం.


లాక్ డౌన్ పీరియడ్ లో ఆన్ లైన్ క్లాస్ వర్క్ ఉన్నతవిద్యకు సంబంధించి కూడా ఆల్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్స్ కు కూడా ఆదేశాలిచ్చాం.