11 మందిని శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి DISCHARGE :కలెక్టర్ జి.వీరపాండియన్

*బిగ్ బ్రేకింగ్ - Kurnool -27-4-2020* - *మరో బిగ్ రిలీఫ్*


*కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన మరో 11 మందిని   నంద్యాల శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం డాక్టర్లు DISCHARGE చేశారు*: *కలెక్టర్ జి.వీరపాండియన్*


*ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 42 మంది కరోనా విజేతలు డిశ్చార్చ్: కలెక్టర్ వీరపాండియన్*


*కర్నూలు జిల్లాలో కరోనా కేసులు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో కరోనా కోరల నుండి ఆరోగ్యంగా బయటపడి ఒకే రోజు 11 మంది డిశ్చార్చ్ కావడం మరొక బిగ్ రిలీఫ్...జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి కరోనాను జయించవచ్చనే నమ్మకం, మనో ధైర్యం పెరిగింది:  కలెక్టర్ వీరపాండియన్*


*ఈ రోజు రాత్రి శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రి నుండి డిశ్చార్చ్ అయిన 11 మంది ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి కరోన బారిన పడి మెరుగైన ప్రభుత్వ వైద్యం, సదుపాయాలతో కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా ఆనందంగా ..జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో ఇంటికి వెళ్లారని కోవిడ్ ఆస్పత్రి ప్రత్యేక అధికారి నారాయణమ్మ , డాక్టర్లు తెలిపారు*


*డిశ్చార్చ్ అయిన 11 మందిలో చాగలమర్రి భార్య భర్తలు ( భార్య వయసు 32 సంవత్సరాలు). (భర్త వయస్సు 38 సంవత్సరాలు), నంద్యాల  ఐలూరు లోని ఇద్దరు పురుషులు (32 సంవత్సరాలు) (61సంవత్సరాలు ) , చాబోలు వాసులు 25 సంవత్సరాల  యువకుడు, 46 సంవత్సరాల పురుషుడు , 50 సంవత్సరాల మహిళ,  నంద్యాల సలీం నగర్ వాసి  32 సంవత్సరాల పురుషుడు,  ఫారుక్ నగర్ 32 సంవత్సరాల పురుషుడు , కోట వీధిలోని 41 సంవత్సరాల పురుషుడు,  నడిగడ్డ లో 26 సంవత్సరాల పురుషుడు డిశ్చార్చ్ అయ్యారని డాక్టర్లు తెలిపారు*


*ఈనెల 5 న  మరియు 8 తేదీలలో శాంతిరాం కోవిడ్ హాస్పిటల్ లోని ఐసోలేషన్  వార్డులలో అడ్మిట్ అయిన 11 మంది ప్రభుత్వ సహాయంతో.. వైద్యులు,  పారామెడికల్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం కృషితో కరోన మహమ్మారిని జయించి, రెండు పర్యాయాలు కరోన పరీక్షలు చేయించుకొని నెగటివ్ ఫలితం రావడం తో కోవిడ్ డిశ్చార్చ్ ప్రోటోకాల్ ప్రకారం ఈరోజు రాత్రి డిశ్చార్జ్ చేసినట్లు శాంతి రామ్ కోవిడ్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు.నంద్యాల సమీపంలో ఉన్న శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి వద్ద జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు కరోనా విజేతలను, డాక్టర్లు, సిబ్బందిని అభినందించి... డిశ్చార్చ్ ఆయిన 24 మందికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదును అందించి...ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపిన  కోవిడ్ ఆస్పత్రి  స్పెషల్ ఆఫీసర్ నారాయణమ్మ.


*కరోనా బారిన పడినా తమ నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకుండా మొత్తం  ప్రభుత్వం తరఫున భరించి.. తమను బాగా చూసుకుని..ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను ఇచ్చి ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి,  ప్రభుత్వానికి,   డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వీరపాండియన్,  అందరికీ ధన్యవాదాలు తెలిపిన 11 మంది కరోనా విజేతలు.ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో కరోనా విజేతలుగా నిలిచి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లి...అందరిలో ధైర్యాన్ని, స్ఫూర్తి ని నింపిన 42 మంది కరోనా విజేతలు


 


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు