అనారోగ్య సమస్యల వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకోసం..,టోల్ ఫ్రీ నంబరు 14410

 


  *నెల్లూరు, 30-04-2020*


లాక్ డౌన్ సందర్భంగా బి.పి, షుగర్, ఇతర సాధారణ అనారోగ్య సమస్యల వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకోసం.., ఏప్రిల్ 13న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్. టెలిమెడిసిన్ సర్వీసును ప్రారంభించారని.., టోల్ ఫ్రీ నంబరు 14410కి కాల్ చేసి వైద్య సహాయం పొందవచ్చునని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డా. రాజేంద్రప్రసాద్ తెలిపారు.


 నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం.., వై.ఎస్.ఆర్. టెలిమెడిసిన్ సేవలపై విలేఖరులతో మీడియా సమావేశం నిర్వహించిన.., వైద్య ఆరోగ్య శాఖ జె.డి..., డయాబెటిస్, బీపీ, కీళ్ల నొప్పులు లేదా  అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినా టోల్ ప్రీ నంబరుకు కాల్ చేయవచ్చన్నారు. 


ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ నాగార్జున మాట్లాడుతూ.. లాక్ డౌన్ సందర్భంగా సాధారణ అనారోగ్య సమస్యలున్న ప్రజలు ఆస్పత్రికి వచ్చి వైద్య సదుపాయం పొందడానికి ఇబ్బందులు పడుతున్నారని.., ఇకపై వై.ఎస్.ఆర్. టెలిమెడిసిన్ టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి వైద్య సదుపాయం పొందవచ్చన్నారు. జనరల్ ఓపీ సేవలు పొందడానికి.., తమ మొబైల్ నుంచి14410కి మిస్ కాల్ ఇస్తే..., వెంటనే కాల్ సెంటర్ సిబ్బంది తిరిగి పేషెంట్ కి కాల్ చేసి.., అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్న వ్యక్తిని వైద్య బృందంతో మాట్లాడే సదుపాయం కల్పిస్తారన్నారు. వైద్యులు రోగి నుంచి అన్ని వివరాలు సేకరించి.., వారికి అవసరమైన మందులను.., పేషెంట్ ఇంటికి సమీపంలోని పి.హెచ్.సి సెంటర్ కి పంపిస్తారన్నారు. పి.హెచ్.సి సెంటర్ లోని వైద్యులు రోగికి అవసరమైన మందులను.., ఎ.ఎన్.ఎం, ఆశా వర్కర్ల ద్వారా ఇంటికి  డోల్ డెలివరీ చేస్తారన్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రజలందరూ.., జనరల్ ఓపీ సేవలు కావాలంటే వై.ఎస్.ఆర్. టెలిమెడిసిన్  టోల్ ఫ్రీ నంబరు 14410కి కాల్ చేసి వైద్య సేవలు పొందాలన్నారు. ఈ మీడియా సమావేశంలో డా. ఉమామహేశ్వరి పాల్గొన్నారు.