15 నుండి రేషన్ పంపిణీకి చర్యలు. :కృష్ణ.జె.సి.కె.మాధవిలత

*15 నుండి రేషన్ పంపిణీకి చర్యలు.


 *సామాజిక దూరం పాటించాలి.


 *జె.సి.కె.మాధవిలత* 


 *విజయవాడ* ,            విజయవాడ నగరంలో ఈ నెల 15వ తేదీ నుంచి రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీకి ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత చెప్పారు. శనివారం సాయంత్రం నిత్యావసర సరుకుల పంపిణీపై పౌరసరఫరాల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 


ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ఉన్న 277 చౌకధరల దుకాణాలు వున్నాయని, వాటిలో సుమారు 152 దుకాణాల పరిధిలో ఇంటిoటికి రేషన్ పంపిణీ చేయబడుతుందన్నారు.


మరో 55 దుకాణాల వద్దే పంపిణీ జరుగుతుందని, మిగిలిన 70దుకాణాల పరిధిలో 130 అదనపు కౌంటర్లు ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించమన్నారు.వేరొక ప్రాంతంలో రేషన్ కార్డు ఉంటే వారికి పోర్టబిలిటీ ద్వారా తీసుకొని కార్డుదారులకు తరువాత దగ్గరలోని దుకాణం ద్వారా తీసుకోవాలన్నారు.


రేషన్ కార్డుదారులకు కుటుంబంలో సభ్యునికి ఒక్కరికీ 5 కిలోల చొప్పున బియ్యం, కార్డు ఒక్కంటికి కిలో శనగపప్పు ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.70 చౌక ధరల దుకాణాల వద్ద రద్దీని నియంత్రించేందుకు వీలైనన్నిచోట్ల 130 అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.కార్డు దారుల రద్దీని నివారించేందుకు కౌంటర్లు వద్ద పెయింటింగ్ తో మార్కింగ్ చేయాలని ,కార్డు దారులకు ముందుగా టోకెన్స్ ఇవ్వాలన్నారు.


రేషన్ పంపిణీ సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో అధికారుల సూచనలు పాటించని డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ హెచ్.యం. ధ్యానచంద్ర, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజ్యలక్ష్మి, డిఏస్ఓ  శోభన్ బాబు,విజయవాడ నగరం,రూరల్ మండలంలోని తహశీల్దార్లు,సహాయ పౌరసరఫరాల అధికారులు, వియంసి పీవో తదితరులు పాల్గొన్నారు.