ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.

ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
రాజా రవివర్మ ఈనాటి భారతదేశములోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని కిలమానూరు రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు ఏప్రిల్ 29, 1848న జన్మించాడు. చిన్నతనములోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళపై
రాజా రవివర్మకుమక్కువ, సాధనతో ప్రపంచస్థాయి చిత్రకారునిగా చరిత్రలో నిలిచిపోయారు.మావలికెర రాజ కుటుంబానికి చెందిన రాణీ భాగీరథీబాయి (కోచు పంగి అమ్మ)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమారుడు, రాకుమారుడు రామవర్మ కూడా చిత్రకారుడు. ఇతనికి శ్రీమతి గౌరీ కుంజమ్మతో వివాహం జరిగింది. ఈమె దీవాన్ పి.జి.ఎన్.ఉన్నిథాన్ చెల్లెలు. రెండవ వాడు రాకుమారుడు రాజరాజవర్మ. పెద్ద కుమార్తె రాకుమారి మహాప్రభ. (ట్రావెన్‌కూర్ రాణీ సేతులక్ష్మీబాయి తల్లి). ఈమె రవివర్మ వేసిన రెండు చిత్రాలలో కన్పిస్తుంది. రెండవ కుమార్తె రాకుమారి ఉమాబాయి. రవివర్మ సంతానము తోటే మావెలికెర రాజ కుటుంబము ఏర్పడింది. ఇంకా ఆయన మనుమరాండ్రు ఇద్దరు మావలికెర రాజ కుటుంబానికి దాయాదులయిన ట్రావెన్కోర్ రాజ కుటుంబానికి దత్తు పోయారు. వారిలో పైన చెప్పబడిన రాణీ సేతులక్ష్మీబాయి కూడా ఉంది. వారి సంతానమే ఇప్పటి ట్రావెన్‌కూర్ రాజ కుటుంబము. బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ పాశ్చాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి. ఎక్కువ భాగవత రామాయణ  ఘట్టాలను అంశంగా తీసుకుని చిత్రీకరించేవారు. రవి వర్మ చిత్రాల్లో ప్రధానమైనవి నలదమయంతి,సీతాపహరణం, రాజా హరిశ్చంద్ర,లక్ష్మీ ,సరస్వతి దేవత మూర్తుల చిత్రాలు ప్రాచుర్యంలో వున్నవి .  లిథోగ్రాఫిక్ యంత్రాలు, చిత్రించడానికి అనువైన రాళ్ళూ, సాంకేతిక నిపుణులను జర్మనీ నుంచి తెప్పించాడు . దేశంలోనే మొదటి సారిగా అత్యాధునిక ప్రెస్ ను ముంబైలో ప్రారంభించి అక్కడ స్థలాభావం కారణంగా, భయంకరమైన ప్లేగు వ్యాపించడం వల్ల, కార్మికులు సరిగా లభించకపోవడం వలన నాలుగు సంవత్సరాల తరువాత మహారాష్ట్ర లోనే కొండ కోనల నడుమ ఉన్న "మలవాలి" అనే గ్రామాన్ని ఎంచుకుని, ప్రెస్, పక్కనే తన నివాసాన్ని కూడా ఏర్పరుచుకున్నాడు. ప్రింటింగ్ పనులు బాగా సాగడంతో కేరళ నుంచి తరచుగా ఈ గ్రామాన్ని సందర్శిస్తుండే వాడు.1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి" కిలామానూరు ప్యాలెస్‌"లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని, ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీ వుంచటం జరిగింది. 
రవివర్మ చనిపోవడానికి రెండేళ్ళ ముందు ప్రెస్ ను తన స్నేహితుడైన ఒక జర్మన్ సాంకేతిక నిపుణుడికి విక్రయించి దానితో పాటు వంద చిత్రాలకు కాపీరైట్ కూడా ఇచ్చాడు. అయితే 1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత మిగిలిన చిత్రాలను ప్రెస్ చుట్టు పక్కల నివసించేవారికి పంచి పెట్టేశారు. ఆ తరువాత ముంబై, పుణే ప్రభుత్వాలు కొన్నింటిని మాత్రమే భద్రపరచగలిగాయి.  ప్రఖ్యాత చిత్ర పరిశ్రమ కళాకారుడు దాదాసాహెబ్ ఫాల్కే గారు కూడా ధర్మ చిత్రాలని తన చిత్రీకరణలో ఉపయోగించుకునేవారు రవివర్మ ప్రాచుర్యం లోకి రావటం జరిగింది అయితే కొంతమంది విమర్శకులు చిత్రాలలో సరిఅయిన భావజాలం లేదని విమర్శించే వారు ఉండేవారు. ఏదేమైనప్పటికీ ప్రపంచ ఖ్యాతి గాంచిన చిత్రకారులలో రవివర్మ ఒక్కరిగా మిగిలిపోయారు. ఇప్పటికీ అనేక మంది చిత్రకారులు రవివర్మకే అనుసరించేవారిని వారు వేసే చిత్రకళలో గమ్మత్తయిన రంగులు అమరిక ఉండేదని అది రవివర్మకే సొంతమని అనేక మంది కళాకారులు వారి మనోభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. నా సంస్థ శ్రీ కళాలయ,ది గ్రూప్ ఆఫ్ ఆర్ట్స్ మొదట స్థాపించినప్పుడు రవివర్మ  చిత్రాలనే  చేసేవారము.  ఏటా విద్యార్థినీ విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయటం, చక్కటి  చిత్రాలు చిత్రీకరించి పోటీలలో గెలుపొందిన పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగేది. అనేక మంది విద్యార్థులు మా శిక్షణాలయం నుండి తయారయ్యే  అనేక పోటీలలో బహుమతులు గెలుచుకున్న  విద్యార్థులు నెల్లూరీయులకు పరిచయమే.అతి తక్కువ రంగుల సమ్మేళనంతో బొమ్మని రూపొందించటం వారికి వారే సాటి. చిత్రకళ ఆర్థిక స్వావలంబన తో పాటు మానసిక పరిపక్వత ,మానసిక ఆనందానికి కూడా దోహదపడుతుంది.కావున మహిళలు, విద్యార్థులు అందరూ కూడా చిత్రకళపై మక్కువ పెంచుకుని కళని నేర్చుకుని కళాత్మకంగా జీవించడం నేర్చుకోవాలని మా సంస్థ నుండి మేము విద్యార్థులకు, వివాహిత మహిళల కు  బోధిస్తూ ఉంటాము.  శ్రీ కళాలయ చారిటబుల్ ట్రస్ట్  తరపున  అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ నెల్లూరియులకు సుపరిచితమే.
గూడూరు లక్ష్మి, కళాకారిణి,
MA(GandhianThoughts,(llb)
Director: Sri Kalalaya charitable Trust ,Pogathota, NELLORE.       cell:944168900.


Popular posts
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*
Image
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పాఠశాలల ప్రారంభ నిర్ణయంపై పునరాలోచించాలి* ఏ.బి.వి.పి నేత చల్లా.కౌశిక్.... వింజమూరు, ఆగష్టు 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచించడం సబబు కాదని, వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌశిక్ బుధవారం నాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి కరోనా బారిన పడి బాధపడుతున్నా వారికి బోధపడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు పధకాల ప్రారంభం, ప్రచార ఆర్భాటాల కోసం పిల్లల జీవితాలను పణంగా పెట్టాలని చూస్తే ఏ.బి.వి.పి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్యార్ధుల తల్లిదండ్రులతో గ్రామ, గ్రామీణ సర్వేను ఏ.బి.వి.పి నిర్వహించిందని కౌశిక్ పేర్కొన్నారు. 82 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, డిగ్రీ, పి.జీ, విశ్వ విద్యాలయాలలో చదివే విధ్యార్ధులు రోగనిరోధక శక్తి కలవారన్నారు. వారిని కాకుండా కేవలం ముందుగా పాఠశాలల బడులను తెరవడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఇలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పర్యవసానాలలో భాగంగా ప్రారంభించిన కొద్ది రోజులలోనే లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఆన్లైన్ ఫీజుల దందాను అరికట్టడంలో శ్రద్దాసక్తులు లేని రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల ప్రారంభానికి ఎందుకంత ఆరాటమన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ఇక ప్రత్యక్షంగా చేసుకోవడానికి ప్రభుత్వం మార్గాలు సుగమం చేయడమేనని కౌశిక్ దుయ్యబట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందా - ప్రభుత్వ పధకాల ప్రచార దందా రెండూ కలిసి వస్తాయా అని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రోగ నిరోధక శక్తి తక్కువ కలిగి ప్రస్తుత కరోనా పరిస్థితులను ఎదుర్కోలేని పసిపిల్లలపై ప్రభుత్వ అసంబద్ధ ప్రయోగాలు విరమించుకోవాలని హితువు పలికారు. లేని పక్షంలో ఏ.బి.వి.పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని కౌశిక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Image