అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488

 
























వ్యవసాయ మంత్రిత్వ శాఖ


లాక్ డౌన్ సమయంలో తొందరగా పాడైపోయే పోయే వస్తువుల అంతర్ రాష్ట్ర రవాణా కు ఉపయోగపడే విధంగా అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488 ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్



 

 

ప్రస్తుత కోవిడ్-19 లాక్ డౌన్ పరిస్థితుల్లో తొందరగా పాడైపోయే పోయే వస్తువుల అంతర్ రాష్ట్ర రవాణా కు ఉపయోగపడే విధంగా అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ ను వ్యవసాయం, రైతుల సంక్షేమశాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు కృషి భావం లో ప్రారంభించారు.  ఈ కాల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన 18001804200 మరియు 14488 నంబర్లకు ఏ మొబైల్ లేదా ల్యాండ్ లైన్ ఫోన్  నుండి ప్రతీ రోజు 24 గంటల్లో ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు.


 


 


Description: C:\Users\India\Desktop\PIB\C2.JPG   Description: C:\Users\India\Desktop\PIB\C3.JPG


కూరగాయలు, పండ్లు వంటి తొందరగా పాడై పోయే ఉత్పత్తులతో పాటు, వ్యవసాయానికి వినియోగించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అంతర్ రాష్ట్ర రవాణా కు రాష్ట్రాల మధ్య సమన్వయము కోసం వారంలో ఏడు రోజులూ 24 గంటలూ పనిచేసే అఖిల భారత రవాణా కాల్ సెంటర్ ను భారత ప్రభుత్వ వ్యవసాయం, సహకారం, రైతు సంక్షేమ శాఖ (డి.ఏ.సి.&.ఎఫ్.డబ్ల్యూ.) ఏర్పాటు చేసింది. 


వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులతో పాటు లేదా విత్తనాలు, ఎరువులతో పాటు తొందరగా పాడై పోయే వస్తువులను అంతర్ రాష్ట్ర రవాణా చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ట్రక్కు డ్రైవర్లు, సహాయకులు, ట్రేడర్లు, చిల్లర వర్తకులు, రవాణా సంస్థలు, రైతులు, ఉత్పత్తిదారులు లేదా ఎవరైనా భాగస్వాములు ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తగిన సహకారం పొందవచ్చు.   కాల్ సెంటర్ లో ఉండే అధికారులు రవాణా వాహనం మరియు కన్ సైన్ మెంట్ వివరాలతో పాటు వారికి అవసరమైన సహాయాన్ని పేర్కొంటూ, సమస్య పరిష్కారం కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తారు. 


హర్యానా, ఫరీదాబాద్ లోని ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్ (ఐ.కె.ఎస్.ఎల్.) కు చెందిన కార్యాలయాల్లో నెలకొల్పిన కాల్ సెంటర్ లైన్లపై పది మంది కస్టమర్ ఎగ్జిక్యూటివ్ లు 24 గంటలు, షిఫ్ట్ కు 8 గంటల చొప్పున 3 షిఫ్టులు పనిచేస్తారు.  అవసరాన్ని బట్టి ఈ కాల్ సెంటర్ సేవలను 20 సీట్ల పూర్తి సామర్ధ్యానికి పెంచుతారు.  ఈ కాల్ సెంటర్ లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లు సమస్యల వివరాలు నమోదుచేసుకుని, వాటిని వేగంగా పరిష్కరించడానికి కృషి చేస్తారు.  


అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ పురుషోత్తం రూపాలా, శ్రీ కైలాష్ చౌదరి, ఏ.సి.&.ఎఫ్.డబ్ల్యూ. కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్ తో పాటు మంత్రిత్వ శాఖ కు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. లాక్ డౌన్ సమయంలో క్షేత్రస్థాయిలో రైతులకు, వ్యవసాయ కార్యకలాపాలకు ప్రయోజనం చేకూర్చడం కోసం డి.ఏ.సి.&.ఎఫ్.డబ్ల్యూ. చేపట్టిన అనేక చర్యల్లో భాగంగా ఈ 24 X 7 కాల్ సెంటర్ ను ప్రారంభించారు.  


 


 


 


Description: C:\Users\India\Desktop\PIB\C1.JPG


 


 


Ministry of Agriculture & Farmers Welfare


Agriculture Minister Shri Narendra Singh Tomar launches All India Agri Transport Call Centre numbers 18001804200 and 14488 to facilitate inter-state movement of perishables during lockdown



 

 


The Union Minister of Agriculture and Farmers Welfare, Shri Narendra Singh Tomar launched the All India Agri Transport Call Centre at a function in Krishi Bhavan today to facilitate inter-state movement of perishables in the current situation of lockdown due to the COVID-19 threat. The Call Centre numbers are 18001804200 and 14488. These numbers can be called from any mobile or landline phones any time of the day or night.


Description: C:\Users\India\Desktop\PIB\C2.JPG   Description: C:\Users\India\Desktop\PIB\C3.JPG


 


The 24x7 service All India Agri Transport Call Centre is an initiative of the Department of Agriculture, Cooperation and Farmers Welfare (DAC&FW), Government of India for coordination between States for inter-state movement of perishables - Vegetables & Fruits, Agri Inputs like seeds, pesticides and fertilizer etc.


Truck drivers and helpers, traders, retailers, transporters farmers, manufacturers or any other stakeholder who is facing problems in inter-state movement of agricultural, horticultural or any other perishable commodities besides seeds and fertilizers may seek help by calling at the Call Centre. Call Center Executives will forward the vehicle & consignment details along with the help needed, to State Government officials for resolution of issues.


Operated by the IFFCO Kisan Sanchar Limited (IKSL) from their offices in Faridabad, Haryana, the Call Centre lines will initially be manned by 10 customer executives round the clock in 3 shifts of 8 hour each. The Call Centre service may be escalated to full capacity of 20 seats based on requirements. The Call Centre Executives will also maintain records and verify the disposal of problem as the case may be.


The Ministers of State (Agriculture and Farmers Welfare) Shri Parshottam Rupala and Shri Kailash Choudhary, Secretary (AC&FW), Shri Sanjay Agarwal, and senior officers of the Ministry were present during the launch function of the All India Agri Transport Call Centre.  The 24x7 Call Centre service is part of several measures undertaken by the DAC&FW to facilitate the farmers and farming activities at field level during the lockdown period.


Description: C:\Users\India\Desktop\PIB\C1.JPG


 


 


 


హోం మంత్రిత్వ శాఖ


దేశంలో కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ స‌వ‌రించిన ఏకీకృత‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ఏప్రిల్ 20,2020 నుంచి అమ‌లులోకి రానున్న స‌వ‌రించిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం, అద‌న‌పు కార్య‌కలాపాలకు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు



 

 

దేశంలో కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని నివారించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, 2020 ఏప్రిల్ 14న జారీచేసిన ,  ఏకీకృత మార్గదర్శకాలలో నిర్దేశించిన  లాక్ డౌన్ చర్యలు 2020 మే 3 వ తేదీ వరకు అమలులో  ఉంటాయ‌ని భార‌త ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది.

భారత ప్రభుత్వ  జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్ర‌కారం, దేశంలో కోవిడ్ -19 అంటువ్యాధిని నివారించడానికి భారత ప్రభుత్వానికి చెందిన వివిధ‌ మంత్రిత్వ శాఖలు , విభాగాలు,రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత‌ ప్రభుత్వాలు తీసుకోవలసిన  లాక్‌డౌన్‌ చర్యలకు సంబంధించి  కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ స‌వ‌రించిన‌, ఏకీకృత మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు కోవిడ్ -19 క‌ట్ట‌డికి, జాతీయ స్థాయి ఆదేశాలను కూడా తెలియ‌జేస్తాయి.. ప‌నిప్ర‌దేశాలు, కార్యాలయాలు, కర్మాగారాలు, వివిధ‌ సంస్థలలో సామాజిక దూరం పాటించడం కోసం ఎస్‌.ఒ.పిలు ; విపత్తు నిర్వహణ చట్టం 2005  ఐండియ‌న్ పీన‌ల్ కోడ్ (ఐపిసి), 1860 లోని  సంబంధిత విభాగాల క్రింద, లాక్‌డౌన్  ఉల్లంఘ‌న‌లకు  సంబంధించిన నేరాలకు జరిమానాల విధింపును ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌లో పొందుప‌రిచారు.
ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను తొల‌గించ‌డానికి, ఎంపిక చేసిన అద‌న‌పు కార్య‌క‌లాపాల‌ను అనుమ‌తించ‌నున్నారు. ఇవి 20 ఏప్రిల్ 2020 నుంచి అమ‌లులోకి వ‌స్తాయి. అయితే , ఈ అదనపు కార్యకలాపాలను లాక్‌డౌన్ కు సంబంధించి  ఇప్పటికే అమ‌లులో  ఉన్న మార్గదర్శకాలకు కట్టుబడి  రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు (యుటిలు) , జిల్లా పాల‌నాయంత్రాంగాలు అమ‌లులోకి తెస్తాయి.
ఈ సడలింపులను  అమ‌లు చేయ‌డానికి ముందు, ప‌ని ప్ర‌దేశాలు, కార్యాలయాలు, కర్మాగారాలు, సంస్థ‌లు   సామాజిక దూరానికి సంబంధించి అన్ని సన్నాహక ఏర్పాట్లు  , ఆయా రంగాల‌కు సంబంధించి అవ‌స‌ర‌మైన ఇత‌ర ఏర్పాట్లు ఉండేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు,  జిల్లా పాల‌నా యంత్రాంగాలు చూడాలి.
ఏకీకృత సవరించిన మార్గదర్శకాలు రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలు,  జిల్లా పాల‌నాయంత్రాంగాలు కంటైన్ మెంట్  జోన్లుగా గుర్తించిన ప్రాంతాల‌కు వ‌ర్తించ‌వు. ఏదైనా కొత్త ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ కింద గుర్తించిన‌ట్ట‌యితే , ఆ ప్రాంతం కంటైన్ మెంట్ జోన్ గా  ప్ర‌క‌టించేంత‌వ‌ర‌కూ అనుమ‌తించిన కార్య‌క‌లాపాల‌ను నిలిపివేస్తారు. అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం మంత్రిత్వ‌శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల కింద అనుమ‌తించిన కార్య‌క‌లాపాల‌ను మాత్రం కొన‌సాగించవ‌చ్చు.
స‌వ‌రించిన ఏకీకృత మార్గ‌ద‌ర్శ‌కాల‌ను క‌చ్చితంగా అమ‌లు చేయాల్సిందిగా భార‌త ప్ర‌భుత్వానికి చెందిన అన్ని మంత్రిత్వ‌శాఖ‌లు, విభాగాలు, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ను కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ ఆదేశించింది.
ఏకీకృత స‌వ‌రించిన మార్గ‌ద‌ర్శ‌కాల కోసం క్లిక్ చేయండి
కేంద్ర హోంమంత్రిత్వ‌శాక రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత‌ప్రాంతాల‌కు పంపిన స‌మాచారం కోసం క్లిక్ చేయండి


 



MHA issues Consolidated Revised Guidelines for the Containment of COVID-19 epidemic in the Country

Additional activities exempted from Lockdown Measures under the Revised Guidelines, to come into effect from 20th April, 2020



 

 

Government of India issued an Order on 14th April, 2020 that the lockdown measures stipulated in the Consolidated Guidelines of Union Ministry of Home Affairs (MHA) for containment of COVID-19 epidemic in the country, will continue to remain in force upto 3rd May, 2020.


 


In pursuance of the above said order of Government of India, MHA has issued consolidated revised guidelines regarding lockdown measures to be taken by Ministries/Departments of Government of India, State/UT Governments for containment of COVID-19 epidemic in the country. The guidelines also prescribe National Directives for COVID-19 management; SOPs for Social Distancing at offices, workplaces, factories and establishments; and, penalties for offences regarding violation of lockdown measures under relevant sections of Disaster Management Act 2005 and IPC, 1860.


 


In order to mitigate hardship to the public, select additional activities would be allowed, which would come into effect from 20th April, 2020. However, these additional activities would be operationalized by States/ Union Territories (UTs)/ District Administrations based on strict compliance to the existing guidelines on lockdown measures. Before operating these relaxations, States/ UTs/ District Administrations shall ensure that all preparatory arrangements with regard to social distancing in offices, workplaces, factories and establishments, and other sectoral requirements are in place.


 


The consolidated revised guidelines would not apply in containment zones, as demarcated by States/ UTs/ District administrations. If any new area is included in the category of a containment zone, the activities allowed in that area till the time of its categorization as a containment zone, would be suspended, except for those activities that are specifically permitted under the guidelines of Union Ministry of Health and Family Welfare (MoHFW), Government of India.


 


MHA has directed all the Ministries/Departments of Government of India and State Governments /Union Territory Administrations for the strict implementation of enclosed consolidated revised guidelines.


 


Click here to see Consolidated Revised Guidelines


Click here to see MHA Communication to States/UT



హోంమంత్రిత్వ శాఖ సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు



 

 

కోవిడ్-19 విస్తరణను అరికట్టడానికి దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ ను 2020 మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2020 ఏప్రిల్ 14వ తేదీన జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. దేశంలోని గుర్తించిన ప్రాంతాల్లో 2020 ఏప్రిల్ 20వ తేదీ నుంచి కొన్ని కార్యకలాపాలు పునః ప్రారంభించడానికి అనుమతించనున్నట్టు కూడా ప్రధానమంత్రి ప్రకటించారు.


ప్రధానమంత్రి ప్రకటనకు అనుగుణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) లాక్ డౌన్ ను 2020 మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ 2020 ఏప్రిల్ 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా యంత్రాంగాలు కరోనా అదుపులోనే ఉన్నవిగా గుర్తించిన ప్రాంతాల్లో ఎంపిక చేసిన మేరకు అదనపు కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతిస్తూ ఎంహెచ్ఏ 2020 ఏప్రిల్ 15న మరో ఉత్తర్వు జారీ చేసింది.


2020 ఏప్రిల్ 15వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుతో పాటుగా కలిపి రూపొందించిన సవరించిన  ఏకీకృత మార్గదర్శకాలు జారీ చేస్తూ 2020 ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన కార్యకలాపాలను కరోనా వ్యాప్తి గల ప్రాంతాల్లో అమలులో ఉన్న నిషిద్ధ కార్యకలాపాలపై ఆంక్షలను తొలగించడంతో పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన కార్యకలాపాల అమలుకు కూడా అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.


లాక్ డౌన్ తొలి దశలో సాధించిన లాభాలను ఏకీకృతం చేయడం, ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని మరింతగా అదుపు చేయడం, అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని  వ్యవసాయదారులు, కార్మికులు, రోజువారీ వేతనాలపై ఆధారపడిన కార్మికులకు ఊరట కల్పించడం ఈ సవరించిన మార్గదర్శకాల లక్ష్యమని తెలిపింది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న నిషిద్ధ కార్యకలాపాల్లో విమాన, రైలు, రోడ్డు ప్రయాణాలు;  విద్యాసంస్థలు, శిక్షణ సంస్థల దైనందిన కార్యకలాపాలు;  పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు;  ఆతిథ్య సేవలతో పాటు అన్ని సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు, థియేటర్ల మూసివేత; అన్ని రకాల సామాజిక, రాజకీయ, ఇతర కార్యక్రమాల రద్దు మత సంస్థలు, ప్రార్థనా స్థలాలకు సాధారణ ప్రజల అనుమతి, మతపరమైన కార్యక్రమాల నిర్వహణపై నిషేధం ఉన్నాయి.


ఇవి కాకుండా కార్యస్థలాల్లోను, ప్రజలు అధికంగా తిరిగే ప్రాంతాల్లోను తప్పనిసరిగా ఇంట్లో తయారుచేసిన ఫేస్ కవర్లు ఉపయోగించడం, శక్తివంతమైన పరిశుభ్రత పాటించడం, శానిటైజర్ల వినియోగం, స్వల్ప సంఖ్యలోనే పనుల నిర్వహణ, యాక్సెస్ కంట్రోల్, థర్మల్ స్ర్కీనింగ్ వంటివి తప్పనిసరి. రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం నిషేధం. పైన పేర్కొన్న నిబంధనలు, నిషేధ ఆంక్షలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తారు.


అయితే 2020 ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమలుజరిగేలా సవరించిన మార్గదర్శకాల్లో అనుమతించిన కార్యకలాపాలేవీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ వ్యాప్తి గలవిగా రాష్ట్ర ప్రభుత్వాలు/   కేంద్రపాలిత ప్రాంతాలు/  జిల్లా యంత్రాంగాలు ప్రత్యేకంగా గుర్తించిన, నిషిద్ధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతాల్లో చేపట్టకూడదు.   మెడికల్ ఎమర్జెన్సీ, శాంతి భద్రతలకు సంబంధించిన విధులు వంటి అత్యవసర సర్వీసులు, కొనసాగింపు తప్పనిసరి అని ప్రభుత్వం గుర్తించిన కార్యకలాపాల కోసం వెళ్లి రావడానికి అనుమతించడం మినహా కోవిడ్-19 విస్తరణ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో అవసరమైన తనిఖీలు నిర్వహించకుండా సాధారణ ప్రజలు లోపలికి రావడం, వెలుపలికి పోవడం వంటివి అనుమతించకూడదు.


కోవిడ్-19 విస్తరణ అధికంగా ఉన్నవిగా లేదా త్వరిత గతిన వ్యాధి వ్యాపిస్తున్నవిగా గుర్తించిన హాట్ స్పాట్ జిల్లాల్లో అత్యంత కఠినమైన నిషేధ చర్యలు అమలుపరచడం తప్పనిసరి. ఈ ప్రాంతాలను సాధారణ ప్రాంతాల నుంచి ఏ విధంగా వేరు చేయాలి, ఏయే నిషిద్ధాజ్ఞలు అమలు పరచాలి అనే విషయంలో సవివరమైన మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతాలన్నింటిలోనూ కేవలం అత్యవసర సర్వీసులను అనుమతించాలి. ప్రాంతం మొత్తంపై గట్టి నిఘా ఉంచడంతో పాటు ప్రజానీకం కదలికలన్నింటి పైన కఠినమైన ఆంక్షలు అమలుపరచాలి.


వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగేందుకు సహాయపడడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో పని చేసేందుకు దోహదపడడం, రోజువారీ కూలీలు, ఇతర కార్మిక శక్తి ఉపాధి అవకాశాలు కొనసాగేలా చూడడం, తగు రక్షణలు/  చట్టబద్ధంగా ఆయా పనుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలతో ఎంపిక చేసిన పారిశ్రామిక కార్యకలాపాలు పునరుద్ధరించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యంగా 2020 ఏప్రిల్ 20వ తేదీ నుంచి పైన సూచించిన కార్యకలాపాలను అనుమతించడం జరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా  కోవిడ్-19 అదుపు చర్యలు పాటించడం కోసం కోవిడ్-19 అదుపు జాతీయ నిర్దేశకాలు కూడా జారీ చేయడం జరిగింది. వైపరీత్యాల నిర్వహణ చట్టం, 2005 పరిధిలో జిల్లా మెజిస్ర్టేట్లు వాటిని కట్టుదిట్టంగా అమలుపరుస్తూ ఉల్లంఘించిన వారికి జరిమానాలు, శిక్షలు విధించడం తప్పనిసరి.


అత్యవసర వస్తువులు, అత్యవసరం కానివి అనే వివక్ష ఏదీ లేకుండా అన్ని రకాల వస్తువుల రవాణాను అనుమతించాలి. నోటిఫైడ్ మండీలు; ప్రత్యక్ష, వికేంద్రీకృత మార్కెటింగ్ విధానాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల సమీకరణ, మార్కెటింగ్; ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల తయారీ, పంపిణీ, రిటైల్;  పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, పశుసంవర్థక కార్యకలాపాలు;  తేయాకు, కాఫీ, రబ్బర్ తోటల పెంపకం సహా అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాలను అనుమతించాలి.


గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కలిగించడం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సహా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలు నడిచేందుకు అనుమతించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, భవనాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణ కార్యకలాపాలను అనుమతించాలి. అలాగే నీటి పారుదల వసతులు,జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తూ ఎంఎన్ఆర్ఇజిఏ కింద పనుల నిర్వహణను; గ్రామీణ కామన్ సర్వీసు కేంద్రాల పనులను అనుమతించాలి. ఈ కార్యకలాపాలన్నీ గ్రామీణ కార్మికులు, వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాయి.


కార్మికులు వచ్చి పోవడంపై నిరంతర పర్యవేక్షణ గల సెజ్ లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, పారిశ్రామిక కేంద్రాలు, పారిశ్రామిక టౌన్ షిప్ లలో తగు ఎస్ఓపి అమలుపరచడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలతో తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతించవచ్చు. ఐటి హార్డ్ వేర్, నిత్యావసర వస్తువుల తయారీ, ప్యాకేజింగ్ కార్యకలాపాలను కూడా అనుమతించాలి. బొగ్గు, ఖనిజాలు, చమురు తయారీ అనుమతించిన కార్యకలాపాల్లో ఉన్నాయి. భద్రతాపరమైన తగు జాగ్రత్తలు తీసుకుంటూ, సామాజిక దూరం పాటిస్తూ పారిశ్రామిక, తయారీ కార్యకలాపాల పునరుద్ధరణకు ఈ చర్యలు దోహదపడతాయి. తద్వారా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అంతే కాదు, పారిశ్రామిక రంగానికి అవసరం అయిన రుణ మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో తగినంత నగదు లభ్యత కోసం ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచే ఆర్ బిఐ, బ్యాంకులు, ఎటిఎంలు, సెబీ నోటిఫై చేసిన పెట్టుబడి, రుణ మార్కెట్లు, బీమా కంపెనీలు కూడా పని చేస్తాయి.


సేవల రంగానికి, జాతీయ వృద్ధికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అత్యంత కీలకం. అందుకు దీటుగా ఇ-కామర్స్ కార్యకలాపాల నిర్వహణ;   ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరం అయిన ఐటి, ఐటి ఆధారిత సర్వీసుల కార్యకలాపాలు, డేటా కాల్ సెంటర్ల నిర్వహణ; ఆన్ లైన్ బోధన, దూర విద్య వంటి కార్యకాలాపాలకు కూడా అనుమతి ఉంది.


ఆరోగ్య సర్వీసులు; ఎలాంటి గోప్యత అవసరం లేకుండా ప్రభుత్వ యుటిలిటీలు; నిత్యావసర వస్తువుల సరఫరా వ్యవస్థ;  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల కీలక కార్యాలయాలు అవసరమైనంత మంది ఉద్యోగులతో పని చేసేందుకు సవరించిన మార్గదర్శకాలు అనుమతిస్తున్నాయి.


మొత్తం మీద గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయాభివృద్ధి, ఉపాధి కల్పన కోణంలో ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా భావించే అన్ని రంగాల కార్యకలాపాలు ఆయా ప్రాంతాల్లో కోవిడ్-19 అదుపు చేయడానికి అమలులో ఉండే చర్యలు కట్టుదిట్టంగా పాటిస్తూ పని చేసేలా అనుమతించడం ఈ సవరించిన ఏకీకృత మార్గదర్శకాల లక్ష్యం.


   నిన్న    ఉదయం విడుదల చేసిన ఈ సవరించిన మార్గదర్శకాలను సమర్థవంతంగా, సరళంగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో కేబినెట్ కార్యదర్శి సమావేశం కానున్నారు. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి, కేంద్ర హోం కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య సర్వీసుల శాఖ కార్యదర్శి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.


 


అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్ పిలు, మునిసిపల్ కమిషనర్లు, సివిల్ సర్జన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనే వారిలో ఉన్నారు.
 


 



Revised Consolidated Guidelines of Ministry of Home Affairs



 

Prime Minister Shri Narendra Modi, in his address to the Nation on April 14, 2020, declared that the lockdown in India will have to be extended till May 3, 2020, with a view to arrest the spread of COVID-19 in the country. Prime Minister also declared that select necessary activities will be allowed to be opened up from April 20, 2020, in identified areas of the country. 


In pursuance of the announcements of the Prime Minister, Ministry of Home Affairs (MHA) issued an order dated April 14, 2020, extending the lockdown in India till May 3, 2020.  Further, MHA issued another Order, dated April 15, 2020, to allow select additional activities in areas not demarcated as containment zones by States/ UTs/ District Administrations.


Along with the Order dated April 15, 2020, consolidated revised guidelines have been issued, delineating the prohibited activities across the country, activities allowed in containment zones, and select permitted activities allowed from April 20, 2020 in the rest of the country.


The objective of the revised guidelines is to consolidate the gains achieved during the 1st phase of lockdown and further slow down the spread of Covid 19 and at the same time provide relief to farmers, labourers and daily wage earners


The activities prohibited across the country include travel by air, rail and road; operation of educational and training institutions; industrial and commercial activities; hospitality services; all cinema halls, shopping complexes, theatres, etc., all social, political and other events, and opening of all religious places/ places of worship for members of public, including religious congregations.


There are certain national guidelines like mandatory home-made face covers at work places and in public places ,strong hygiene and health care measures like provision of sanitisers , staggered shifts , access control , thermal screening and imposing fines for spitting etc. penalties will be imposed for violation.


The activities permitted under the revised guidelines, from April 20, 2020 will not be allowed within the containment zones as demarcated by States/ UTs/ District Administrations, as per the guidelines of Ministry of Health & Family Welfare (MoHF&W).  In these zones, no unchecked inward/ outward movement of population would be allowed, except for maintaining essential services, i.e., medical emergencies and law & order duties, and government business continuity. 


Very strong containment measures will be implemented in the hotspot districts accounting for large number of Covid 19 cases or with fast growth of cases. Detailed guidelines on delineation of containment zones and containment measures have also been issued. Only essential services are to be permitted in these zones and strict perimeter control and strict restrictions on movement enforced.


The permitted activities from April 20, 2020 are aimed at ensuring that agricultural and related activities remain fully functional, the rural economy functions with maximum efficiency, employment opportunities are created for daily wage earners and other members of the labour force, select industrial activities are allowed to resume their operations, with adequate safeguards and mandatory standard operating protocols (SOPs) and the digital economy.  At the same time, keeping the imperative of containing the spread of COVID-19 in the country, National Directives for COVID-19 management have been laid down, which shall be enforced by the District Magistrates through fines and penal action as prescribed in the Disaster Management Act, 2005.


Transportation of goods will be permitted without any distinction of essential or non essential. Farming operations, including procurement of agricultural products, agriculture marketing through notified Mandis and direct and decentralized marketing, manufacture, distribution and retail of fertilizers, pesticides and seeds; activities of marine and inland fisheries; animal husbandry activities, including the supply chain of milk, milk products, poultry and live-stock farming; and tea, coffee and rubber plantations are allowed to be functional. 


To provide an impetus to the rural economy, industries operating in rural areas, including food processing industries; construction of roads, irrigation projects, buildings and industrial projects in rural areas; works under MNREGA, with priority to irrigation and water conservation works; and operation of rural Common Service Centres (CSCs) have all been allowed.  These activities will create job opportunities for rural labor, including the migrant labor force.


Manufacturing and other industrial establishments with access control have been permitted in SEZs, EoUs, industrial estates and industrial townships after implementation of SOP for social distancing.  Manufacture of IT hardware and of essential goods and packagings are also allowed.  Coal, mineral and oil production are permitted activities.  It is expected that the industrial and manufacturing sectors will see a revival with these measures, and will create job opportunities while maintaining safety protocols and social distancing.  At the same time, the important components of the financial sector, e.g., RBI, banks, ATMs, capital and debt markets as notified by SEBI and insurance companies will also remain functional, with a view to provide enough liquidity and credit support to the industrial sectors.


Digital economy is critical to the services sector and is important for national growth.  Accordingly, e-commerce operations, operations of IT and IT enabled services, data and call centres for Government activities, and online teaching and distance learning are all permitted activities now. 


The revised guidelines also permit all health services and the social sector to remain functional; public utilities to function without any hindrance; the supply chain of essential goods to operate without any hindrance; and, important offices of Central and State Governments and local bodies to remain open with required strength. 


In sum, the revised consolidated guidelines are aimed at operating those sectors of the economy which are critical from the perspective of rural and agricultural development and job creation, while maintaining strict protocols in areas where safety is paramount to contain the spread of COVID-19 in the country.


Meeting is being held by Cabinet Secretary with state Chief Secretaries and DGPs to discuss smooth and effective implementation of revised guidelines that were issued earlier in the morning today. Principal Secretary to the Prime Minister, Union Home Secretary and Union Health Secretary are also present.


All Collectors, SPs municipal commissioners and civil surgeons are also participating in the conference.


 


పార్సిల్ రైళ్ల ద్వారా రైల్వేస్ కి ప్రారంభమైన ఆదాయం; లాక్ డౌన్ సమయంలో 20,400 సరకుల రవాణా; రూ.7.54 కోట్ల ఆదాయం
లాక్ డౌన్ సమయంలో సరఫరా గొలుసు వ్యవస్థకు అనుబంధంగా చిన్న పరిమాణాలలో నిత్యావసర వస్తువుల పార్సిళ్ళు- త్వరగా రవాణా చేయడానికి భారత రైల్వేస్ పార్శిల్ వ్యాన్లు అందుబాటులోకి



ప్రస్తుతం 65 రూట్లలో నడిచిన రైళ్లు; ఏప్రిల్ 14 వరకు 507 రైళ్లలో ఈ సరకు రవాణా



 

 

కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో చిన్న పరిమాణంలో వైద్య సామాగ్రి, వైద్య పరికరాలు, ఆహారం మొదలైన ముఖ్యమైన వస్తువుల పార్సిళ్లను రవాణా చేయడం అన్నది చాలా ముఖ్యం. ఈ కీలకమైన అవసరాన్ని తీర్చడానికి, ఇ-కామర్స్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఇతర వినియోగదారులకు సంబంధించిన సరకు రవాణా చేయడానికి భారత రైల్వే- రైల్వే పార్శిల్ వ్యాన్లను అందుబాటులోకి తెచ్చింది. నిత్యావసర వస్తువుల నిరంతరాయ సరఫరా చేయడానికి, ఎంపిక చేసిన మార్గాల్లో సమయ-పట్టిక అనుసరించి ప్రత్యేక పార్సిల్ రైళ్లను నడపాలని రైల్వేస్ నిర్ణయించింది.  ఈ ప్రత్యేక పార్సిల్ రైళ్ల కోసం జోనల్ రైల్వేలు క్రమం తప్పకుండా రూట్లను గుర్తించి నోటిఫై చేశాయి.


i) దేశంలోని ప్రధాన నగరాలు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మధ్య రెగ్యులర్ కనెక్టివిటీ


ii) రాష్ట్ర రాజధానులు / ముఖ్యమైన నగరాల నుండి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ 


iii) ఈశాన్య ప్రాంతాలకు కనెక్టివిటీ 


iv) మిగులు సరుకు ఉన్న ప్రాంతాల (గుజరాత్, ఎపి) నుండి అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు పాలు, పాల ఉత్పత్తుల సరఫరా 


v) ఉత్పత్తి చేసే ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలకు అవసరమైన వస్తువుల (వ్యవసాయ అవసరాలు, మందులు, వైద్య పరికరాలు మొదలైనవి) సరఫరా


ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉన్న లెక్కల ప్రకారం మొత్తం వివిధ మార్గాల్లో పార్సిళ్ల రవాణాకు 77 రైళ్లు నడిచాయి. వాటిలో 75 రైళ్లు నిర్ధిష్ఠ టైమ్-టేబుల్ ప్రకారం నడిచిన పార్సెల్ స్పెషల్ రైళ్లు. మొత్తం 1835 టన్నుల సామగ్రిని లోడ్ చేయడం ద్వారా ఒకే రోజు రైల్వేకు రూ.63 లక్షల ఆదాయం సమకూరింది. 


అదే కాలానికి  మొత్తం నడిచిన రైళ్ల సంఖ్య 522 అయితే అందులో నిర్దిష్ట టైం-టేబుల్ ప్రకారం 458  రైళ్లు నడిచి 20,474 టన్నుల సరకులను లోడ్ చేశాయి, వాటి ద్వారా మొత్తం ఆదాయం సుమారు రూ.7.54 కోట్లుగా తేలింది. 


                                                *****



Parcel Trains beginning to bring revenue for Railways; Over 20400 tonnes of consignments have been loaded since it's start in Lockdown period and the earnings are about Rs 7.54 crores

Indian Railways has made parcel vans available for quick transportation of essential items in small parcel sizes to supplement the supply chain during lockdown


Presently these trains are being operated on 65 routes; total 507 number of trains run till 14th April



 

 




Transportation of essential items like medical supplies, medical equipment, food, etc in small parcel sizes is going to be very important during the lockdown in the wake of COVID-19. In order to fill in this vital need, Indian Railways has made railway parcel vans available for quick mass transportation by E-Commerce entities and other customers including State governments. Railways have decided to run time-tabled Parcel Special trains on select routes, to ensure uninterrupted supply of essential items.


 


Zonal Railways are regularly identifying and notifying routes for these Parcel Special trains. Presently these trains are being operated on sixty-five (65) routes. These routes have been identified to include:


 


i) Regular connectivity between major cities of the country, viz Delhi, Mumbai, Kolkata, Chennai, Bengaluru & Hyderabad


ii) Connectivity from state-capitals/important cities to all parts of the state


iii) Ensuring connectivity to the North-eastern part of the country


iv) Supply of milk and dairy products from surplus regions (Gujarat, AP) to high demand regions


v) Supply of other essential items (agricultural inputs, medicines, medical equipment, etc) from producing regions to other parts of the country


 


On 14.04.2020 till 18:00 hrs, seventy seven (77) trains were run, out of which seventy five (75 ) were time-tabled Parcel Special trains. 1835 Tonnes of material was loaded, giving an earning of Rs 63 lacs to Railways in one day.


 


The total number of trains run till 18:00 hrs on 14.04.2020 is 522, out of which 458 have been time-tabled trains. 20, 474 Tonnes of consignments have been loaded, and the earnings have been around Rs 7.54 crores.


 





ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం 30వేల కవరాల్స్‌
ఏప్రిల్‌లో భారత రైల్వేశాఖ వ్యక్తిగత రక్షణ సామగ్రి తయారీ లక్ష్యం
మే నెలలో ఉద్యమ తరహాలో ఏకంగా లక్ష పీపీఈ తయారీకి ప్రణాళిక
ఇటువంటి ఉత్పత్తుల తయారీలో ఇతర భాగస్వాములకు ఆదర్శం
రైల్వే ఉత్పాదక సంస్థలు, జోనల్‌ వర్క్‌షాపులు, క్షేత్ర యూనిట్ల సన్నద్ధత



 

 

కోవిడ్‌-19 రోగులకు సేవలందిస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు, కార్యకర్తల కోసం వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కవరాల్స్‌ తయారీని భారత రైల్వేశాఖ చేపట్టింది. ఈ మేరకు రైల్వే ఉత్పాదక సంస్థలు, వర్క్‌షాపులు, క్షేత్రస్థాయి యూనిట్లు ఇప్పటికే పని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఏప్రిల్‌ నెలాఖరులోగా 30 వేల కవరాల్స్‌ తయారుచేయాలని నిర్దేశించుకోగా- మే నెలలో లక్ష కవరాల్స్‌ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. వీటి నమూనాలను ఇప్పటికే గ్వాలియర్‌లోని డీఆర్‌డీవో లేబొరేటరీ పరీక్షించి అత్యున్నత ప్రమాణాలతో ఉన్నట్లు ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19పై నిర్విరామంగా శ్రమిస్తున్న భారత రైల్వేశాఖ డాక్టర్లు, ఇతర వైద్య నిపుణులు, ఆరోగ్య కార్యకర్తలకు ఈ పీపీఈ కిట్లను సరఫరా చేయనుంది. వీటిని ఒకసారి మాత్రమే వాడే వీలుందిగనుక, భారీ సంఖ్యలో తయారుచేయడం అవసరం. దీంతో ప్రస్తుతం తమ శాఖ పరిధిలోని డాక్టర్లకు, ఇతర సిబ్బందికి అవసరమైన కవరాల్స్‌ తయారీని రైల్వే సంస్థలు ప్రారంభించాయి. అయితే, వీటి తయారీకి కావాల్సిన ముడిపదార్థాలకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్‌తోపాటు కొరత కూడా అధికంగానే ఉంది. అయినప్పటికీ రైల్వేశాఖ వెనుకంజ వేయకుండా పీపీఈ కిట్ల సత్వర తయారీకి అన్ని వనరులనూ సమకూర్చుకుంది. కోవిడ్‌-19 రోగులకు చికిత్స కోసం స్వల్ప వ్యవధిలోనే దాదాపు 5,000 బోగీలను తాత్కాలిక క్వారంటైన్‌/ఏకాంత చికిత్స సదుపాయాలుగా మార్చేసిన రైల్వేశాఖకు నేడు పీపీఈ కిట్ల తయారీ కష్టమేమీ కాదనడంలో సందేహం లేదు.