కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల కాంటాక్ట్స్ సర్వే  నిర్వర్తిస్తున్న సిబ్బంది పై భౌతిక దాడులు చేస్తే కఠిన చర్యలు : డా. కే.ఎస్. జవహర్ రెడ్డి


కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల కాంటాక్ట్స్ సర్వే  నిర్వర్తిస్తున్న సిబ్బంది పై భౌతిక దాడులు చేస్తే కఠిన చర్యలు :


డా. కే.ఎస్. జవహర్ రెడ్డి. ఐ.ఏ.ఎస్.


 ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 
ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ 
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై కాంటాక్ట్ ట్రేసింగ్ సర్వే సమయంలో, రోగుల మృత దేహాల ఖననాల సందర్భముగా  దహన వాటికలలో ,  వైద్య సేవలు అందించే ఆసుపత్రులు/క్లినిక్ లు, క్వారంటైన్/ ఐసొలేషన్ కేంద్రాలు, మొబైల్ వైద్య సేవలందించే విభాగాలు, తదితర ప్రదేశాల్లో భౌతిక దాడులు జరుగు తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.  కరోనా వైరస్ వ్యాప్తిపై లేని పోని అపోహలతో వైద్య సిబ్బంది విధులకు ఆటకం కలిగించ రాదనీ ఈ సందర్భం గా  ప్రజలకు విజ్ఞప్తి చేయటం జరుగు తోంది. కోవిడ్ వ్యాధిగ్రస్తుల యొక్క  కాంటాక్ట్ ల అన్వేషణ వంద శాతం పూర్తి  చేసి, సంబంధిత వ్యక్తులకు తగు పరీక్షలు చేయటం ద్వారానే ఈ వ్యాధి నివారణ త్వరిత గతిన సాధ్య మవుతుంది. 


కోవిడ్ వ్యాధిగ్రస్తుల పార్దివ దేహాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం స్టెరిలైజ్  చేసి సీల్ చేయటం జరుగుతుంది. ఇటువంటి మృత దేహాలను   పూడ్చటం లేదా కాల్చటం ద్వారా కరోనా  వ్యాప్తికి ఎటువంటి ఆస్కారం ఉండదు. కనుక ప్రజలందరూ ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాల్సిందిగా కోరటమైంది. సమాజ హితం కోసం పాటు పడే  వైద్య సిబ్బంది విధుల నిర్వహణకు సమాజంలోని ప్రజలందరూ సహకరించాలి.


కేంద్ర ప్రభుత్వం 22 ఏప్రిల్ 2020 న తీసుకొని వచ్చిన ఆర్డినెన్స్ ద్వారా విధి నిర్వహణలో ఉన్న   వైద్య/వైద్యేతర  సిబ్బంది పై జరిగే  దౌర్జన్యకర సంఘటనలన్నింటినీ శిక్షార్హమైన, బెయిలుకు అవకాశం లేని నేరాలుగా ప్రకటించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఇటువంటి  దౌర్జన్యకర చర్యలకు పాల్పడే లేదా ప్రేరేపించే లేదా ప్రోత్సహించే వారికి 3 నెలల నుంచి 5 సంవత్సరాలు కారాగార వాస శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించ వచ్చు. అలాగే విధి నిర్వహణలో ఉన్న వైద్య, వైద్యేతర  సిబ్బందిని ప్రమాదకరంగా గాయపరిచే సంఘటనలకు పాల్పడే వారికి 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలు జరిమానా విధించవచ్చు. దీనికి తోడు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారే బాధితులకు నష్టపరిచిన ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారం అందించాల్సి ఉంటుంది.


కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం  కఠిన చర్యలు తీసుకోవల్సినదిగా జిల్లా కల్లెక్టర్లకు తగు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.


డా. కే.ఎస్. జవహర్ రెడ్డి. ఐ.ఏ.ఎస్.


 ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 
ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ


Popular posts
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
దసరా సెలవుల్లో.. రైళ్లు.. ఫుల్‌
చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు
టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనా విడుదల చేసిన చంద్రబాబు
Image