కోవిడ్‌ –19 నివారణకు సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ*

 


*02–04–2020*


*కోవిడ్‌ –19 నివారణకు సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ*


అమరావతి: కోవిడ్‌ –19 నివారణా చర్యలకోసం ప్రభుత్వశాఖలు, ఉద్యోగులు, వివిధ సంస్థలు, కంపెనీలు, ప్రముఖవ్యక్తులు బాసటగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ పిలుపు మేరకు సీఎం సహాయ నిధికి ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు. 


1.  రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖ  రూ. 200.11కోట్లు



కోవిడ్‌ – 19 నివారణా చర్యలకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్‌ శాఖలనుంచి సీఎం సహాయ నిధికి రూ. 200.11 కోట్ల విరాళాన్ని అందించారు.  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌కు చెక్కును అందించారు. జిల్లా మైనింగ్ ఫండ్, ఏపీఎండీసీ, మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ ఉద్యోగుల విరాళం, ఉపాధి హామీ, వాటర్‌ షెడ్‌ శాఖ ఉద్యోగుల విరాళం,సెర్ప్‌ ఉద్యోగుల విరాళం మొత్తంగా కలిపి రూ.200.11 కోట్ల విరాళాన్ని కోవిడ్‌ నివారణా చర్యలకోసం సీఎం సహాయ నిధికోసం ఇచ్చారు. 
ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు, పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ, మైనింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామ్‌ గోపాల్,  సెర్ప్‌ సీఈఓ రాజబాబు, ఏపీఎండీసీ వైస్‌ ఛైర్మన్, మేనేజింగ్‌డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, డీజీఎం వెంకటరెడ్డి హాజరయ్యారు. 


2.  అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ రూ.11 కోట్లు


కోవిడ్‌ –19 నివారణలో భాగంగా అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ రూ.11కోట్ల రూపాయలను ప్రకటించింది. ఇందులో రూ. 7.5 కోట్లను సీఎం సహాయ నిధికి చెక్కు రూపంలో అందించగా, మరో రూ.3.5 కోట్ల రూపాయలను హై ఎండ్‌ మెడికల్‌ కిట్లుకోసం, మాస్కులు, శానిటైర్స్‌ రూపంలో ఇస్తోంది.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు రూ.7.5కోట్ల చెక్కును అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి అందించారు. వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


3. కియా మోటార్స్‌ రూ.2 కోట్లు


కోవిడ్‌ నివారణా చర్యల్లో ప్రతిష్టాత్మక కియా మోటార్స్‌ రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపింది. సీఎం సహాయ నిధికి రూ. 2 కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్టు వెల్లడించింది. విరాళాలకి సంబంధించిన పత్రాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు కియా మోటర్స్‌ ఇండియా ఎండీ కుక్‌హ్యూన్‌ షిమ్‌ అందించారు.


4. శ్రీ సిటీ ఫౌండర్‌ రూ. 2 కోట్లు


కోవిడ్‌ –19 సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ సిటీ ఫౌండర్‌ – మేనేజింగ్‌ డైరెక్టర్‌ సన్నారెడ్డి రవీంద్ర రూ.2 కోట్ల రూపాయల విరాళం అందించారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీనేత వి.విజయసాయిరెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. 



5.  వర్షిణి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ రూ. 1.10 కోట్లు


 వర్షిని ఛారిటబుల్‌ ట్రస్టు తరఫున మెహర్‌ శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1కోటి 10 లక్షల రూపాయలను అందించారు. దీనికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సలహాదారు తలశిల రఘురాం పాల్గొన్నారు. 



6. ప్రభాస్‌ రూ.50 లక్షలు – సీఎం ప్రశంస


కరోనా వైరస్‌ నివారణకు సినీ హీరో ప్రభాస్‌ రూ. 50 లక్షల రూపాయలను అందించారు. ఈమేరకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రభాస్‌ను అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని పంపించారు. ప్రభాస్‌ చేసిన సహాయం కోవిడ్‌ –19 నివారణా చర్యలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. 


7. జి.ఎల్‌.మంథాన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ రూ. 25 లక్షలు


కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం విజయనగరానికి చెందిన జి.ఎల్‌.మంథానీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం ప్రకటించారు. ట్రస్టీ బిజయ్‌ మంథానీ ఈ మొత్తాన్ని ఆన్‌ లైన్‌ ద్వారా సిఎంఆర్‌ఎఫ్‌కు జమచేశారు. 


8. ఐఏఎస్‌ అధికారుల సంఘం – 3రోజుల వేతనం


కోవిడ్‌ –19 సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మూడు రోజుల వేతనాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. 
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు విరాళాలకు సంబంధించి పత్రాన్ని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, విజయకుమార్, ప్రద్యుమ్న, ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ ఆసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌ అందించారు. ఈ మొత్తం దాదాపు రూ.20లక్షలు ఉంటుందని ఐఏఎస్‌ అధికారులు తెలిపారు. 


9. జెల్‌కాప్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 5లక్షలు


జెల్‌కాప్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 5లక్షల రూపాయలను సీఎం సహాయనిధికి అందించింది. నేరుగా ఆన్‌లైన్‌ద్వారా దీనికి సంబంధించిన మొత్తాన్ని జమచేసింది.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు