చరిత్రలో ఈరొజు -ఏప్రియల్ 19
సంఘటనలు
1971 : మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1ప్రయోగం.
1975 : భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్టసోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు.
2009: భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
*🌷జననాలు 🌷*
1856: అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (మ.1930)
1912: గ్లెన్న్ సీబోర్గ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త,నోబెల్ బహుమతి గ్రహీత. (మ. 1999)
1921: నాగభూషణం, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1995)
1930: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి.
1956: వై. ఎస్. విజయమ్మ, ఆంధ్రప్రదేశ్శాసనసభ్యులు. పులివెందుల శాసనసభకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతిధ్యం వహిస్తున్నారు.
1957: ముకేష్ అంబానీ, రిలయన్స్ కంపెనీ అధినేత.
1957: రాసాని వెంకట్రామయ్య, కథ, నవల, నాటక రచయిత, విమర్శకుడు.
*🍁మరణాలు🍁*
1882: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (జ.1809)
1906: పియరీ క్యూరీ, ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ. 1859)
1969: గిడుగు వేంకట సీతాపతి, ప్రసిద్ధ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (జ.1885)
2006: సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, ప్రసిద్ధి స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1909)