కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

30–04–2020
అమరావతి


కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష


అమరావతి: కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం         వైయస్‌.జగన్‌ సమీక్ష
వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరు
రాష్ట్రంలో కోవిడ్‌ –19 పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరాలు అందించిన వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి


కర్నూలు జీజీహెచ్‌ ఆస్పత్రిలో సౌకర్యాలపై  పరిశీలన చేయాలని సీఎం ఆదేశం
వెంటనే వాటిని మెరుగుపరచడానికి పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలి:  సీఎం
క్వారంటైన్లలో వసతి, సదుపాయాలు మెరుగుపర్చడంపై దృష్టిపెట్టాలి:
పారిశుద్ధ్యం, మంచి భోజనం అందించడానికి దృష్టిపెట్టాలి:


ఇప్పటివరకూ రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షల సంఖ్య 94,558 
ప్రతి పదిలక్షల జనాభాకు 1,771 పరీక్షలు
పాజిటివిటీ కేసుల శాతం 1.48 శాతం, దేశవ్యాప్తంగా 4 శాతం 
మరణాల రేటు 2.21 శాతం, దేశవ్యాప్తంగా 3.26 శాతం


ఇవికాక 68వేలకుపైగా ర్యాపిడ్‌ టెస్టులు చేశామన్న అధికారులు
గడచిన మూడు–నాలుగు రోజుల్లో మరణాలు లేవన్న అధికారులు
రానున్న రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి సంఖ్య బాగా పెరుగుతుందన్న అధికారులు


ప్రస్తుతం కేసుల వారీగా రాష్ట్రంలో వెరీ యాక్టివ్‌ క్లస్టర్స్‌ – 80,
యాక్టివ్‌ క్లస్టర్స్‌–64, డార్మంట్‌ క్టస్టర్స్‌– 66, 28 రోజుల నుంచి కేసుల్లేని క్లస్టర్స్‌ 20
కేసులు అధికంగా వస్తున్న కర్నూలు, విజయవాడ, గుంటూరుల్లోని ప్రాంతాల్లో పటిష్ట ఆరోగ్య వ్యూహాన్ని అమలు చేస్తున్నామన్న అధికారులు
ఇక్కడ పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని వెల్లడి
హైరిస్క్‌  ఉన్నవారిని ముందుగానే గుర్తించి, వారికి విస్తృతంగా పరీక్షలు చేసి ముందస్తుగానే వైద్య సేవలు అదించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టామన్న అధికారులు
దీనివల్ల మరణాలు లేకుండా చూడ్డానికి వీలవుతుందన్న అధికారులు


టెలిమెడిసిన్‌పైనా సీఎం సమీక్ష
ప్రిస్కిప్షన్లు, వీటితోపాటు మందులు అందేలా మూడు రోజుల్లోగా సమగ్ర వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికారులు


కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చ
ఇది చాలా అమానవీయమని పేర్కొన్న సమావేశం
కరోనా అన్నది ఎవరికైనా సోకవచ్చు: సీఎం
అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చు : సీఎం
అంటరాని వాళ్లగా చూడ్డం కరెక్టుకాదు :సీఎం
అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిమీద ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం కరెక్టుకాదు: సీఎం
అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్టు కాదు:
అడ్డుకున్న వారిలో ఎవరికైనా రావొచ్చు:
మనవాళ్లకే ఇలాంటివి జరిగితే.. ఎలా స్పందిస్తామో.. అలాగే స్పందించాలి:
ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలని డీజీపీని  ఆదేశించిన సీఎం
కరోనా వస్తే.. మందులు తీసుకుంటే.. పోతుంది:
కరోనా వచ్చిన వారిని అంటరాని వారిగా చూడ్డం సరికాదు:
తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్టు అవుతుంది:
కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసు∙కుంటాం, కేసులుకూడా పెడతామన్న అధికారులు:
కరోనా వస్తే అది భయానకమనో, అది సోకినవారిని అంటరాని తనంగా చూడ్డం సరికాదు:
రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డిశ్చార్జి అవుతున్నారు?:
నయం అయితేనే కదా... డిశ్చార్జి అయ్యేది?:
తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నంచేయొద్దు : సీఎం
దేశవ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26శాతం అంటే.. మిగతా వాళ్లు డిశ్చార్జి అవుతున్నట్టే కదా?:
అదికూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‌ ప్రభావం చూపుతుంది:


వ్యవసాయం– అనుబంధ రంగాలు :


రైతుల ఇబ్బందులపై ఎక్కడ నుంచి సమాచారం వచ్చినా దాన్ని పాజటివ్‌గా తీసుకుని ౖవాటి తొలగించడంపై దృష్టిపెట్టండి:
వీలైంత త్వరగా మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యాప్‌  ద్వారా సమాచారాన్ని తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయండి:
అలాగే 1902 నంబర్‌ను గ్రామ సచివాలయాల్లో బాగా ప్రచారం చేయాలి:
కష్టం ఉందని ఎక్కడనుంచి రైతులు ఫోన్‌చేసి చెప్పినా వెంటనే చర్యలు తీసుకోవాలి: సీఎం
కూపన్లు జారీచేసి పంటలు కొనుగోలు చేసిన విధానంపట్ల రైతుల్లో మంచి సానుకూలత ఉందన్న అధికారులు
అన్ని పంటలకూ ఇదే విధానాన్ని వర్తింపుచేయాలన్న సీఎం
రోజుకు 60వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్న అధికారులు
వీలైనంతమేర సేకరించాలని సీఎం ఆదేశం
అలాగే మొక్కజొన్న రోజుకు 8వేల టన్నులు సేకరిస్తున్నామని వెల్లడించిన అధికారులు