రోగ నిరోధక శక్తిని పెంచుకోండి - టీవీకే రెడ్డి, కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు

               విజయవాడ, తేదీ:29.04.2020
 రోగ నిరోధక శక్తిని పెంచుకోండి - టీవీకే రెడ్డి, కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు  
     విజయవాడ :          కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో అ మహమ్మారి నుండి రక్షణ పొందడానికి  ప్రతి ఒక్కరూ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ, కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన లో కోరారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రజలు శానిటైజర్లు, మాస్క్ లతో ఎంత  జాగ్రత్తగా ఉన్నా వారి శరీరంలో రోగనిరోధక శక్తి లేనట్లయితే వారు కరోనా బారినపడే అవకాశం ఉందని అందుకే ఆయుర్వేద పద్దతుల ద్వారా మరియు ప్రకృతి సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ వారు చేసిన సలహాలు, సూచనలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని ఆయన తెలిపారు. 
     సాధారణ పద్ధతుల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే దాహం అనిపించినపుడల్లా గోరువెచ్చని నీరు తాగాలని, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలని, రోజువారీ వంటకాల్లో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా వుండేలా చూసుకోవాలని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆయుర్వేద పద్ధతుల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిరోజూ ఉదయం ఒక టీ స్పూన్ చవనప్రాశ తినాలని, మధుమేహం ఉన్నవారు చక్కెర లేని చవనప్రాశ తీసుకోవాలని, తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైన వాటితో చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒకటి నుంచి రెండు సార్లు తాగాలని, రుచి కోసం అందులో బెల్లం లేదా తాజా నిమ్మ రసం కలుపుకోవచ్చని, 150 మిల్లీ లీటర్ల పాలలో అర స్పూన్ పసుపు కలుపుకొని రోజుకు ఒకటి, రెండు సార్లు తీసుకోవాలని పేర్కొన్నారు.


      సులభమైన ఆయుర్వేద పద్ధతుల ద్వారా కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని, ఇందుకోసం నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యిని ముక్కు రంద్రాల దగ్గర పట్టించాలని, దీన్ని ఉదయం మరియు సాయంత్రం చేయాలని తెలిపారు. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె నోటిలో వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు పుక్కిలించిన తరువాత ఊసెయ్యాలని, ఆ తరువాత వెంటనే నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఈ పనిని రోజుకు ఒకటి రెండు సార్లు చేయవచ్చన్నారు.   పొడి దగ్గు ఉంటే పుదీనా ఆకులు లేదా సోపు గింజలు కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలన్నారు. లవంగాల పొడిని బెల్లం లేదా తేనెతో కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గు, గొంతు గరగరల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. ఒక వేళ పొడి దగ్గు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 24x7 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 104 లేదా 1902కు కాల్ చేయవచ్చని సమాచార శాఖ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image