కోవిడ్‌–19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష

*16–04–2020,*
*అమరావతి.*


*కోవిడ్‌–19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*పాల్గొన్న ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు.


 


 


*రాష్ట్రంలో కోవిడ్‌ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష


కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం 
కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సీఎం స్పష్టీకరణ


వివిధ సెంటర్ల నుంచి క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న వారిని ఇంటికి పంపేటప్పుడు బీదలకు రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశం
ముందుజాగ్రత్త చర్యగా వారిని మనం క్వారంటైన్లో పెడుతున్నాం:
తిరిగి ఇంటికి పంపించినప్పుడు రూ. 2వేల డబ్బు చేతిలో పెట్టాలి:
పౌష్టికాహారం తీసుకోవాలని వారికి సూచనలు చేయాలి:
లేదంటే.. మళ్లీ సమస్య మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుంది:
క్వారంటైన్‌నుంచి ఇంటికి పంపేటప్పుడు వారికి సూచనలు చేయాలి:
మనం ఇచ్చే డబ్బు ద్వారా పాలు, గుడ్డు, కూరగాయలు లాంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి:
ఇలా చేయడం సమాజానికి కూడా మంచిది:
అన్నిరోజులు క్వారంటైన్‌లో పెట్టి ఒకేసారి మనం ఇంటికి పంపితే... పస్తు ఉండే పరిస్థితి ఉండకూడదు:


*క్వారంటైన్లలో సదుపాయాలపై నిరంతరం దృష్టిపెట్టాలి:సీఎం*


మాస్క్‌ల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలి:
మొదటి హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో మాస్క్‌లను పంపిణీచేయాలి: 
ప్రతి మనిషికి .. మూడు మాస్క్‌లు పంపిణీ:
రేపటి నుంచి డెలివరీ ప్రారంభిస్తామన్న అధికారులు
రెండు మూడురోజుల తర్వాత డెలివరీని పెంచుతామన్న అధికారులు*రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలన్న సీఎం*
అలాగే మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో పెట్టాలన్న సీఎం
రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండేలా చూసుకోవలని, కియోస్క్‌లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన సీఎం


ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని మార్కెటింగ్‌ కార్యకలాపాలు నిర్వహించాలన్న సీఎం
ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
వినూత్న పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో అమ్మడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి : సీఎం 


సమీక్షా సమావేశంలో  పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి బొత్స సత్యన్నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం