స్క్రాప్ గోడౌన్ వద్ద అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి శంకరనారాయణ

*పెనుకొండ మండలం రామాపురం వద్ద  ఐరన్, వుడ్  స్క్రాప్ గోడౌన్ వద్ద అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి శంకరనారాయణ


*పరిస్థితిని  అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది.*


*రాష్ట్ర ప్రభుత్వ అగ్నిమాపక శాఖ అధికారులు చేపట్టిన ముమ్మర చర్యల వలన మంటలు అదుపులోకి వచ్చాయి*


*జనావాసాలకు, గృహ సముదాయాలకు దూరంగా ఇటువంటి గోడౌన్లు ఉండేట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి*


*అనంతపురం 27.04.2020*


సోమవారం, ఉదయం నిన్నటి దినాన పెనుకొండ మండలం రామాపురం వద్ద  ఐరన్, వుడ్  స్క్రాప్ గోడౌన్ వద్ద జరిగిన ఘోర అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మాలగూండ్ల శంకరనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కియా కార్ల సంస్థ నుండి వచ్చే ఐరన్, వుడ్ స్క్రాప్ను నిలువ చేసేందుకు తమిళనాడుకు చెందిన వ్యక్తి స్థానిక రామాపురంలో స్థలం అద్దెకు తీసుకున్నారని, ఎటువంటి అనుమతులు లేకుండా గత 3 సంవత్సరాలుగా ఇక్కడ స్క్రాప్ను నిలువ చేస్తున్నట్లు, అంతేకాకుండా స్ట్రాప్ ను నిలువ చేసేందుకు ఏర్పాటు చేసిన షెడ్డులో ఎటువంటి అగ్నిమాపక పరికరాలు గాని సేఫ్టీ మేజెర్స లేని కారణంగా ఇంతటి ప్రామాదం వాటిల్లిందని మంత్రి పేర్కొన్నారు.  అంతేకాకుండా స్ట్రాప్ క్రయవిక్రయాలు జరుపుతున్న తమిళనాడు సంస్థ సరైన అనుమతులు లేకుండా, వర్క్ మెన్ కాంపెన్సేషన్ సంబంధించిన విషయాలు, లేబర్ యాక్ట్ కు సంబంధించిన ఏ విషయాలను పాటించకుండా గృహ సముదాయాల మధ్యలో ఈ షెడ్డును ఏర్పాటు చేయడంవలన నిన్న జరిగిన అగ్ని ప్రమాదం వలన స్థానిక గ్రామస్తులు భయాందోళనకు గురైయ్యారని గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు, జిల్లా అగ్నిమాపక అధికారికి, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు గారికి, పెనుకొండ సబ్ కలెక్టర్ నిశ్సాంతి గారికి అప్రమత్తం చేయడం, వారు వెంటనే స్పందించి, తక్షణమే అగ్ని మాపక సిబ్బంది సహాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన షెడ్డు ఆవరణ తప్పించి ప్రక్కనే వున్న ఏ ఇల్లు గాని, ప్రైవేటు ఆస్తికి గాని మంటలు వ్యాపించకుండా, ఎటువంటి నష్టం వాటిల్లికుండా పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. గోడౌన్లో అగ్నికి ఆజ్యం పోసే చెక్క సామాగ్రి, ఆయిల్ కంటైనర్లు, వాహనాలు, సిలిండర్లు వంటి వస్తువులు ఉన్నాయని, నిర్లక్ష్యధోరణితో వ్యవహరించిన  గోడౌన్ యాజమాన్యంపై తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా ఇలాంటి స్క్రాప్ గోడౌన్లు కియా పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వున్న వాటిపైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గృహ సముదాయాల మధ్య ఉన్న గోడౌన్లను ఊరి బైట ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 


పాల్గొన్న ఎంపిడిఓ శివశంకరప్ప, ఎమ్మార్వో నాగరాజు, సిఐ శ్రీహరి, ఎస్సై హరూన్ బాషా మండల వైసీపీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పట్టణ కన్వీనర్ తయూబ్, శంకర రెడ్డి, గుట్టూరు శ్రీరాములు, నాగలూరు బాబు, మునిమడుగు శ్రీనివాసులు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు.